టూ మచ్ బోల్డ్​లుక్​లో దర్శనమిచ్చిన దిశా పటానీ.. ఇంటర్నెట్ తగలబెడతావా ఏంటీ!

టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన లోఫర్ చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ దిశా పటానీ.

Update: 2024-03-27 15:46 GMT

దిశ, సినిమా: టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన లోఫర్ చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ దిశా పటానీ. టాలెంట్, అందం, నటనతో పరిశ్రమలో తనకంటూ సొంత ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంది. కేవలం తెలుగులోనే కాకుండా హిందీ, తమిళ్, చైనీస్ వంటి భాషల్లో నటించి తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ప్రస్తుతం ఈ బ్యూటీ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ‘కల్కి 2829’ సినిమాలో నటిస్తుంది. దిశా పటానీ సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషలో మీడియాలో మాత్రం అందాలు ఆరబోయడం ఆపడం లేదు.

వారంలో నాలుగు సార్లైన కుర్రాళ్ల మతిపోయేలా స్టన్నింగ్ ఫొటో షూట్ చేస్తూ సోషల్ మీడియాను షేక్ చేస్తుంటుంది. తాజాగా ఈ బ్యూటీ వైట్ కలర్ డ్రెస్ ధరించి బ్యూటిఫుల్ ఫొటోలకు ఫోజులిచ్చింది. ఎద అందాలు కనిపించేలా సోఫా పై కూర్చుని.. చేతికి డైమండ్ లా మెరిసిపోయే ఉంగరాలు తొడిగి.. కాళ్లకు వైట్ కలర్ స్టోన్స్ పట్టీలు పెట్టుకుంటూ అదిరిపోయే ఫొటో షూట్ చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ తన ఫ్యాన్స్ తో పంచుకోగా.. ఇంటర్నెట్ ను తగలబెడదామనుకుంటున్నావా ? అంటూ దిశా పటానీ పై ఘాటు కామెంట్లు చేస్తున్నారు.

Full View


Similar News