ఆ ఇద్దరు స్టార్ హీరోయిన్లతో నాకు అక్రమ సంబంధం ఉంది.. స్టార్ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు

సినీ ఇండస్ట్రీలో ప్రేమలు- బ్రేకప్‌లు, పెళ్లిళ్లు-డివోర్స్ కామన్.

Update: 2024-01-17 09:38 GMT

దిశ, సినిమా: సినీ ఇండస్ట్రీలో ప్రేమలు- బ్రేకప్‌లు, పెళ్లిళ్లు-డివోర్స్ కామన్. నటీనటీమణులు కొన్నాళ్ల పాటు రిలేషన్‌లో ఉండటం.. బోర్ కొట్టగానే విడిపోవడం సాధారణం అయిపోయింది అంటూ నెట్టింట జనాలు కామెంట్లు చేస్తుంటారు. అయితే తాజాగా బాలీవుడ్ దర్శకుడు విక్రమ్ భట్ ఓ ఇంటర్వ్యూకు హాజరై ఇద్దరు హీరోయిన్లతో ఎఫైర్ ఉందంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు.

‘‘మాజీ ప్రపంచ సుందరి, స్టార్ నటి సుస్మితా సేన్ అండ్ అమీషా పటేల్‌తో నాకు సంబంధం ఉంది. నా చిన్ననాటి ఫ్రెండ్ అదితి భట్‌ను వివాహం చేసుకున్నాను. అయినప్పటికీ వారితో కొన్నాళ్లపాటు రిలేషన్ కొనసాగించాను. లైఫ్‌లో చాలా తప్పులు చేశాను. కానీ ఆ తప్పు చేశాను కదా అంటూ ఏ రోజు బాధపడను. చేసిన ప్రతి తప్పు నుంచి ఏదోటి నేర్చుకుంటాను. సుస్మితా సేన్‌తో ఎఫైర్ కారణంగా నా వైవాహిక జీవితంలో పలు సమస్యలు వచ్చాయి. ఆ తప్పులన్నింటికి నేను బాధ్యుడిని. అమీషా-సుస్మితా ఇద్దరు మంచివాళ్లే. నా భార్య కూడా చాలా మంచిది. వీళ్లే కాదు నా జీవితంలో చాలా మంది మహిళలు వచ్చి.. వెళ్లారు’’. అంటూ దర్శకుడు విక్రమ్ భట్ చెప్పుకొచ్చాడు.




Similar News