Director Vijay Bhaskar: అది ప్రేమ కాదు ఉన్మాదం: సక్సెస్‌ఫుల్ దర్శకుడు విజయ్‌భాస్కర్‌

కుటుంబ భావోద్వేగాలకు, సున్నితమైన హాస్యాన్ని జోడించి క్లీన్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ చిత్రాలను రూపొందించడంలో దర్శకుడు విజయ్‌ భాస్కర్‌ది ప్రత్యేక శైలి.

Update: 2024-07-27 13:33 GMT

దిశ,  సినిమా: కుటుంబ భావోద్వేగాలకు, సున్నితమైన హాస్యాన్ని జోడించి క్లీన్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ చిత్రాలను రూపొందించడంలో దర్శకుడు విజయ్‌ భాస్కర్‌ది ప్రత్యేక శైలి. ఆయన దర్శకత్వంలో వచ్చిన నువ్వు నాకు నచ్చావ్‌, మన్మథుడు, మల్లీశ్వరి వంటి కుటుంబ కథా చిత్రాలు ఇప్పటికి ఎవర్‌గ్రీన్‌ సినిమాలుగానే నిలిచాయి. తాజాగా ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన మ‌రో ల‌వ్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ ఉషా పరిణయం. ఈ చిత్రానికి ల‌వ్ ఈజ్ బ్యూటిఫుల్ అనేది ఉప‌శీర్షిక‌. ఈ చిత్రంలో శ్రీ‌క‌మ‌ల్‌, తాన్వీ ఆకాంక్ష‌, సూర్య ముఖ్య‌తార‌లు. ఆగస్టు 2న చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా కె.విజయ్‌భాస్కర్‌ మీడియాతో ముచ్చటించారు ఆ విశేషాలివి.

'ఉషా పరిణయం'తో మీరు ఏం చెప్పబోతున్నారు?

ఉషా పరిణయం ప్రేమకు నేను ఇచ్చే నిర్వచనం. నేటి సమాజంలో ప్రేమ పేరుతో అమ్మాయిలపై దాడులు జరుగుతున్నాయి. ప్రేమించకపోతే వారిని అన్ని రకాలుగా హింసిస్తున్నారు. అసలు అది ప్రేమకాదు. అందరు అలాంటిది జరిగినప్పుడు అందరూ ప్రేమోన్మాదం అంటున్నారు. అయితే అది నా దృష్టిలో అంది ఓన్లీ ఉన్మాదం. అలాంటి వాడు ప్రేమికుడు కాదు సైకో. ప్రేమలో హింస వుండదు. హింస వుంటే అది ప్రేమకాదు. ఇది నా శైలిలో చెప్పాలనుకున్నాను. ప్రేమ ఎలా వుండాలో నా పాయింట్‌తో ఓ కథ చెప్పాలనుకున్నా చెబుతున్నాను. ఇదొక యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌. దీనికి వినోదాన్న జోడించి, నిజమైన ప్రేమను చూపిస్తున్నాను.

ఈ కథ మీ తనయుడు శ్రీకమల్‌ కోసమే అనుకున్నారా?

ఈ కథను మొదట్లో ఇద్దరు ముగ్గురు హీరోలకు చెప్పాను. అయితే అది కార్యరూపం దాల్చలేదు. అయితే కమల్‌ నటించిన జిలేజి చిత్రం తరువాత ఈ కథకు అతనికి సరిపోతుందనిపించింది. కమల్‌ వయసుకు కరెక్ట్‌గా సూట్‌ అయ్యే కథ ఇది.

కమల్‌ను ఈ చిత్రం హీరోగా నిలబెడుతుందా?

కమల్‌కు ఇదొక మంచి అవకాశం. ఇది ఇంటెన్సీటి ప్రేమకథ సినిమా. ఈ సినిమాతో తాన్వీ ఆకాంక్షను అనే అచ్చ తెలుగమ్మాయిని కథానాయికగా పరిచయం చేస్తున్నాం. ఇదే అమ్మా అమ్మాయిని జై చిరంజీవి టైమ్‌లో అడిషన్‌లో బాలనటిగా తిరస్కరించాను. చాలా మంచి ప్రవర్తన వున్న అమ్మాయి. వాళ్లిద్దరితో పాటు నాకు కూడా ఈ సినిమా మంచి అవకాశం. మంచి యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. మసాలా తరువాత నువ్వు నాకు నచ్చావ్‌ జానర్‌లో వున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లాంటి సినిమా చేసిన ఫీల్‌ కలిగింది.

ఇప్పుడున్న పోటీలో కామెడీని పండించే సన్నివేశాలు రాసుకోవడం టఫ్‌గా అనిపిస్తుందా?

అలాంటిది ఏమీ లేదు. కామెడీకి పరిమితులు ఏమీ లేవు. కొంత మంది సీరియస్‌గా వుంటూ కూడా నవ్విస్తారు. నా సినిమాలో వినోదం అనే ప్రత్యేకంగా వుండదు. కథలోనే కామెడీ వుంటుంది. మన్మథుడు మెగాస్టార్‌ చిరంజీవికి మ్యాచ్‌ అవ్వదు. జై చిరంజీవ వెంకటేష్‌కు సరిపోదు.నువ్వు నాకు నచ్చావ్‌ వెంకటేష్‌ను తప్ప మరెవరినీ ఊహించుకోలేం. ఈ సినిమా కథ ఓ యూత్‌ఫుల్‌ కుర్రాడి కోసం తయారుచేసిన కథ. కమల్‌కు సరిపోయ కథ. సినిమా చూసిన తరువాత ఆడియన్స్‌ కూడా ఇదే అంటారు.

మీ వారసుడు అంటే దర్శకత్వం వైపు వస్తాడని అందరూ అనుకుంటారు? కానీ హీరోగా చేయడానికి రీజన్‌?

మొదట్లో దర్వకత్వం వైపు వస్తానని అన్నాడు. అయితే నేను మాత్రం నీవు నటన వైపు దృష్టి పెట్టమని చెప్పాను. ఆ తరువాత దర్శకత్వం అంటే ఎంతో టఫ్‌ అనేది కమల్‌కు అర్థమైంది. మనకు ఏది తెలియదో.. తెలుసుకోవడమే గొప్ప విజ్క్షానం అని రవీంధ్రనాథ్‌ ఠాగూర్‌ చెప్పినట్లు వయసు వచ్చిన తరువాత తండ్రి చెప్పింది కరెక్ట్‌ అని రియలైజ్‌ అయ్యే టైమ్‌కు అతనికి నువ్వు చెప్పింది తప్పు అని చెప్పే కొడుకు వుంటాడు,

ఉషా పరిణయం నేటి ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగానే వుంటుందా?

ఆడియన్స్‌ టేస్ట్‌ మారింది అనే విషయాన్ని నేను ఒప్పుకోను. మంచి కథతో ఎంటర్‌టైన్‌ చేయగలిగితే.. ప్రేక్షకులు సినిమా చూస్తారు. ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేయడానికి ఎన్ని కొత్త వేదికలు వచ్చినా అన్ని ఎలిమెంట్స్‌ కథలో జోడిస్తే సినిమాలు తప్పకుండా చూస్తారు. థియేటర్‌కు వస్తారు

ఈ చిత్రంలో ఫ్యామిలీ ఆడియన్స్‌ ఆకట్టుకునే అంశాలు వున్నాయా?

సినిమా యూత్‌ఫుల్‌గా వుంటుంది. కానీ మా టార్గెట్‌ మాత్రం కుటుంబ ప్రేక్షకులే. సినిమా అంటే అందరూ కలిసి కూర్చొని చూసే విధంగా వుండాలి. అలాంటి అంశాలు లేకుండా సినిమాలు తీస్తే ప్రేక్షకులు రారు. అందరూ కలిసి బోజనం చేసినట్టుగా అందరూ కలిసి కూర్చొని చూసే సినిమాలు వస్తే బాగుంటుంది. ఒక సెక్షన్‌ ఆఫ్‌ ఆడియన్స్‌ను సంతృప్తిపరిచేలా సినిమా తీస్తే కుదరదు. అందర్ని అలరించే కథతో సినిమాలు రావాలి ఈ సినిమా తప్పకుండా అందరూ ఫ్యామిలీతో కలిసి చూసే విధంగా వుంటుంది.

ఉషా పరిణయం టైటిల్‌ జస్టిఫికేషన్‌ ఏమిటి!

నాకు ఎప్పట్నుంచో ఈ టైటిల్‌తో సినిమా చేయాలని వుండేది. ఇన్నాళ్లకు కుదిరింది. ఇందులో హీరోయిన్‌ పేరు కూడా ఉషా. సినిమా అంతా ఆమె పెళ్లి గురించే. ఇంతకు ముందు లవ్‌ అనే ఎమోషన్‌ ఎంతో సున్నితంగా వుండేది. ఇప్పుడు ఓటీటీల ప్రభావం ఏంటో కానీ ప్రేమకథలో ఆ సున్నితత్వం పోయింది. ప్రేమ అనేది ఎంతో నోబుల్‌ ఎమోషన్‌. ఈ రోజు కథల్లో అది మిస్‌ అవుతుంది. ఆ అమ్మాయి భావాలను శాసించే హక్కు ఎవరికి వుండదు. ఇలాంటివి అన్ని ఈసినిమాలో ఎంటర్‌టైనింగ్‌ చెబుతున్నాను. తప్పకుండా ఈ చిత్రం థియేటర్‌లోనే చూడాలనే ఫీలింగ్‌ ప్రేక్షకుల్లో కలుగుతుంది.

Tags:    

Similar News