కృష్ణంరాజుకు వచ్చిన దుస్థితి రేపు పవన్ కల్యాణ్, మహేశ్ బాబుకూ తప్పదు: RGV
తెలుగు చిత్ర పరిశ్రమ సీనియర్ నటుడు, మాజీ కేంద్రమంత్రి కృష్ణంరాజు అనారోగ్యంతో కన్నుమూసిన విషయం తెలిసిందే.
దిశ, వెబ్‌డెస్క్: తెలుగు చిత్ర పరిశ్రమ సీనియర్ నటుడు, మాజీ కేంద్రమంత్రి కృష్ణంరాజు అనారోగ్యంతో కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన మరణాన్ని జీర్ణించుకోలేకపోయిన ఇండస్ట్రీ పెద్దలు, ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా కృష్ణంరాజును గుర్తుచేసుకుని సంతాపం ప్రకటించారు. అయితే, సీనియర్ నటుడు మరణించి ఇండస్ట్రీ మొత్తం విషాదంలో ఉంటే.. కొందరు చేసిన పని ప్రముఖ దర్శకుడు ఆర్జీవీకి కోపం తెప్పించింది. కృష్ణంరాజు తుదిశ్వాస విడిచిన రోజు టాలీవుడ్‌లో కొన్ని సినిమాల షూటింగ్‌లు అలాగే కొనసాగించారు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన రామ్‌గోపాల్ వర్మ సోషల్ మీడియా వేదికగా వారిపై సీరియస్ అయ్యారు. ''మనసు లేకపోయినా ఓకే. కనీసం మన చావుకి విలువ ఉండాలంటే పోయిన కృష్ణంరాజుగారి లాంటి పెద్దమనిషికి విలువ ఇద్దాం.. కనీసం రెండు రోజులు షూటింగ్స్ ఆపుదాం. డబ్బు ఎక్కువ ఖర్చు అయిపోతోంది అని నెలరోజులు షూటింగ్ ఆపేసిన పరిశ్రమ మనది. భక్త కన్నప్ప, కటకటాల రుద్రయ్య, బొబ్బిలి బ్రహ్మన్న, తాండ్ర పాపారాయుడు లాంటి అత్యంత గొప్ప చిత్రాలను అందించిన మహా నటుడు, గొప్ప నిర్మాత కోసం ఒక్కరోజు కూడా షూటింగ్ ఆపలేని అత్యంత స్వార్థపూరిత తెలుగు సినిమా పరిశ్రమకు నా జోహార్లు. సిగ్గు! సిగ్గు!'' అంటూ ట్విట్టర్ వేదికగా అసహనం వ్యక్తం చేశారు.
మరో ట్వీట్‌లో ఇండస్ట్రీ పెద్దలకు కీలక సూచనలు చేశారు. ''కృష్ణగారికి, మురళీమోహన్ గారికి, చిరంజీవిగారికి, మోహనబాబుగారికి, బాలయ్యకు, పవన్ కల్యాణ్‌కు, మహేశ్ బాబుకు, ప్రభాస్‌కు నేను ఈ విషయం మీద మనవి చేసేదేంటంటే రేపు ఇదే దుస్థితి మీలో ఎవరికీ కూడా తప్పదు. ఒక మహోన్నత కళాకారుడికి ఇవ్వలేని మహోన్నత వీడ్కోలు మన మీద మనమే ఉమ్మేసుకోవడం లాంటిది.'' అని పేర్కొన్నారు.
నాకు ఆహీరోతో లిప్ లాక్ కావాలి.. హీరోయిన్ రిక్వెస్ట్‌కు డైరెక్టర్ షాక్