‘ప్రాజెక్ట్ కే’ విజువల్స్ ఎఫెక్ట్స్‌పై నాగ్ అశ్విన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

ప్రభాస్ నటిస్తున్న వరుస పాన్ ఇండియా సినిమాల కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్.

Update: 2023-10-31 13:15 GMT

దిశ, సినిమా: ప్రభాస్ నటిస్తున్న వరుస పాన్ ఇండియా సినిమాల కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. ప్రశాంత్ నీల్‌తో సలార్, నాగ్ అశ్విన్‌తో కల్కీ, మారుతి దర్శకత్వంలో రాజా డీలక్స్, సందీప్ వంగ‌తో స్పిరిట్.. ఇలా వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు ప్రభాస్. అయితే ఇందులో నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ‘కల్కి 2898ఎడి’ కోసం భారీ లెవెల్లో ప్లాన్‌లు చేస్తున్నారట మేకర్స్. ఇక తాజాగా ఈ మూవీ విజువల్స్ ఎఫెక్ట్స్‌పై డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

నాగ్ అశ్విన్ మాట్లాడుతూ ‘నేను మొదట ఈ చిత్రానికి మొత్తం వి.ఎఫ్.ఎక్స్ అన్నీ ఇండియాలోనే చేయిద్దాం అనుకున్నాను. కానీ కొన్ని కారణాలవల్ల సాధ్యపడలేదు. బట్ దాదాపు వి.ఎఫ్.ఎక్స్ వర్క్ మాత్రం లోకల్‌గానే చేశాము. ఇక నా నెక్ట్స్ సినిమాకు మాత్రం పూర్తిగా ఇండియాలోనే కంప్లీట్ చేస్తా’ అని తెలిపాడు. ప్రజంట్ నాగ్ అశ్విన్ మాటలు వైరల్ అవుతున్నాయి.

Tags:    

Similar News