ఇదే నా బెస్ట్ మూవీ అంటున్నారు.. ‘దేవర’పై డైరెక్టర్ కామెంట్స్

యంగ్ టైగర్ ఎన్టీఆర్, డైరెక్టర్ కొరటాల శివ కాంబోలో వచ్చిన చిత్రం ‘దేవర’.

Update: 2024-09-27 15:10 GMT

దిశ, సినిమా: యంగ్ టైగర్ ఎన్టీఆర్, డైరెక్టర్ కొరటాల శివ కాంబోలో వచ్చిన చిత్రం ‘దేవర’. ఈ మోస్ట్ వెయిటెడ్ సినిమా భారీ అంచనాల మధ్య నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. రిలీజ్‌కు ముందే ఎన్నో రికార్డులను సృష్టించిన ఈ మూవీ.. ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే మూవీ టీమ్ తాజాగా ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ కొరటాల శివ ‘దేవర’ సినిమాపై చేసిన కామెంట్స్ ప్రజెంట్ వైరల్ అవుతున్నాయి.

‘మా సినిమాను ఆదరిస్తున్న ఫ్యాన్స్, సినీ లవర్స్ ప్రతీ ఒక్కరిని థాంక్యూ. దాదాపు మూడేళ్ల ప్రయాణమిది. మాకు ఇంత పెద్ద విజయాన్ని ఇచ్చినందుకు తెలుగు ప్రేక్షకులకు థాంక్యూ. నిన్న రాత్రి నుంచి వరుస ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ఇది నా బెస్ట్ ఫిల్మ్ అని అందరూ మెచ్చుకుంటున్నారు. ఈ మూవీ కోసం టీమ్ ఎంతో కష్టపడి పనిచేసింది. అందువల్లే ఈ సక్సెస్ వచ్చింది’ అని చెప్పుకొచ్చాడు. 


Similar News