టాలీవుడ్‌లో మరో తీవ్ర విషాదం.. కె.విశ్వనాథ్ సతీమణి కన్నుమూత
టాలీవుడ్‌లో మరో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కళాతపస్వి కె.విశ్వనాథ్ సతీమణి జయలక్ష్మి కన్నుమూశారు.
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్‌లో మరో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కళాతపస్వి కె.విశ్వనాథ్ సతీమణి జయలక్ష్మి కన్నుమూశారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్‌లోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తుదిశ్వాస విడిచారు. జయలక్ష్మి మరణవార్త తెలిసి పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా తమ తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. కాగా, కె.విశ్వనాథ్ కన్నుమూసి కనీసం నెలరోజులైనా గడవకముందే ఆయన సతీమణి కన్నుమూయడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.