డైరెక్టర్ సెటైర్.. నేనేమీ హీరోయిన్ను పట్టుకుని లాగలేదు.. నా భార్యకు లిప్‌లాక్ ఇచ్చా
ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా యూజర్స్ ఎక్కువైపోతున్నారు.
దిశ, సినిమా: ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా యూజర్స్ ఎక్కువైపోతున్నారు. ప్రతి ఒక్కరు ఇన్స్టాగ్రామ్, ఫేస్ బుక్, ట్విట్టర్ వంటి వాటిలో తమ వ్యక్తిగత విషయాలతో పాటు.. పర్సనల్స్ కూడా తీసుకొచ్చి నెట్టింట షేర్ చేస్తున్నారు. దీంతో కొంత మంది ట్రోల్స్‌కు గురవతున్నారు. ఈక్రమంలోనే తాజాజా సినీ నిర్మాత హన్సల్ మెహతా తన భార్యకు లిప్ కిస్ ఇచ్చిన ఫొటోను ట్విట్టర్ వేదికగా షేర్ చేశాడు. ఇది కాస్త వైరల్ అవ్వడంతో ట్రోల్స్ మొదలుపెట్టారు కొంత మంది వ్యక్తులు. ‘ఈ లిప్‌లాక్ ఫోటోలలో ఉన్న ఈ దుష్టుడు ఎవరు’ అంటూ ట్రోల్స్ చేశారు. తాజాగా దీనిపై చిత్ర నిర్మాత హన్సల్ మెహతా స్పందించారు. ‘మీ ట్రోలింగ్ పనిచేయదు.. ఇది ఒక వ్యక్తి తన భార్యను ముద్దు పెట్టుకోవడం.. బహిరంగంగా తన ప్రేమను వ్యక్తం చేయడం. స్త్రీని నెట్టడం కాదు, బహిరంగంగా స్త్రీద్వేషాన్ని ప్రదర్శించడం’ అని మెహతా చెప్పుకొచ్చారు.