Allu Arjun: ఆయ్ మూవీ హీరోని అభినందించిన బన్నీ.. ఆ ఫొటోల్లో అల్లు అర్జున్ షర్ట్‌ పై అమ్మాయిని గమనించారా?

ఆ షర్ట్ చూస్తుంటే బాగా అందంగా రెడీ అయినా అమ్మాయి ముఖమే కనిపిస్తుందంటూ

Update: 2024-08-21 14:08 GMT

దిశ, సినిమా: ఎన్టీఆర్ బామ్మర్ది హీరో నార్నె నితిన్ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో దూసుకెళ్తున్నాడు. ఇటీవల ఆయ్ మూవీతో వచ్చి సూపర్ హిట్ కొట్టాడు. స్నేహం, ప్రేమ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ ఆడియెన్స్ ని బాగా ఆకట్టుకుంది. ఇప్పటికే రూ. 5 కోట్లకు పైగా వసూలు చేసి రికార్డు బ్రేక్ చేసింది. దీంతో సినీ నటులు ఆయ్ మూవీ యూనిట్ ని అభినందిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ కూడా ఆయ్ మూవీ టీమ్ ని కలిసి కంగ్రాట్స్ తెలిపారు.

ఈ మూవీని GA 2 పతాకంపై అల్లు అర్జున్ క్లోజ్ ఫ్రెండ్ బన్నీ వాసు నిర్మించాడు. దీంతో హీరో నార్నె నితిన్ ని, బన్నీ వాసుని మీట్ అయి బన్నీ ప్రత్యేకంగా అభినందించారు. ఈ క్రమంలో ఆయ్ చిత్ర బృందంతో అల్లు అర్జున్ దిగిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

అయితే, ఈ ఫొటోల్లో అల్లు అర్జున్ ధరించిన షర్ట్ గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు. అమ్మవారి ముఖ చిత్రంలాగా షర్ట్ మీద ఉంది. పుష్ప 2 మూవీలో అల్లు అర్జున్ లేడి గెటప్ వేసిన విషయం తెలిసిందే. దానికి సంబందించినదే అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. ఆ షర్ట్ చూస్తుంటే బాగా అందంగా రెడీ అయినా అమ్మాయి ముఖమే కనిపిస్తుందంటూ కామెంట్స్ చేస్తున్నారు. 


Similar News