2024 మిస్ వరల్డ్ క్రిస్టినా గురించి ఈ విషయం తెలసా?
భారత్ వేదికగా జరిగిన మిస్ వరల్డ్ పోటీల్లో ..2024 మిస్ వరల్డ్ కిరీటాన్ని చెక్ రిపబ్లిక్‌కు చెందిన క్రిస్టినా పిస్కోవా దక్కించుకుంది.రన్నరప్‌గా లెబనాన్‌కు చెందిన అజైటౌన్ నిలిచారు .భారత్ తరపున ప్రాతినిథ్యం
దిశ, సినిమా : భారత్ వేదికగా జరిగిన మిస్ వరల్డ్ పోటీల్లో ..2024 మిస్ వరల్డ్ కిరీటాన్ని చెక్ రిపబ్లిక్‌కు చెందిన క్రిస్టినా పిస్కోవా దక్కించుకుంది.రన్నరప్‌గా లెబనాన్‌కు చెందిన అజైటౌన్ నిలిచారు .భారత్ తరపున ప్రాతినిథ్యం వహించిన కన్నడ భామ సినీ శెట్టి టాప్8కే పరిమితమయ్యారు. ఇక ఈ కార్యక్రమానికి అతిథిగా ప్రముఖ మహిళా పారిశ్రామికవేత్త నీతా అంబానీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమెకు మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ చైర్ ఉమెన్ జూలియా మోర్లీ మిస్ వరల్డ్ హ్యూమానిటేరియన్ అవార్డును ప్రదానం చేశారు.
ఇక చెక్ రిపబ్లిక్‌కు చెందిన ఈ అందాల సుందరి క్రిస్టిన 1999 జనవరి 19న జన్మించింది. దేశ రాజధాని ప్రేగ్‌లోని చార్లెస్ యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో డిగ్రీ పట్టా అందుకోవడమే కాకుండా, మేనేజ్‌మెంట్ కోర్సు కూడా చేస్తోంది.ఈ అమ్మడు చదువులోనే కాకుండా కల్చరల్ యాక్టివిటీస్‌లో కూడా తన ప్రతిభ చాటుతోంది.అయితే ప్రస్తుతం మిస్ వరల్డ్‌కు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అది ఏమిటంటే? క్రిస్టినా పిజ్ కోవా పేరుతో ఏకంగా ఫౌండేషన్ ను కూడా స్థాపించింది.దాని ద్వారా అనేక మంది పేద పిల్లలకు చదువు కోసం పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అలాగే మానసిక రోగులకు కూడా తనవంతు సహాయం చేస్తోందంట.