ఆ యంగ్ డైరెక్టర్ వల్లే మెహరీన్ ఫిర్జాదా పెళ్లి చెడిపోయిందా?
టాలీవుడ్ యంగ్ హీరోయిన్లలో మెహరీన్ ఫిర్జాదా ఒకరు
దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరోయిన్లలో మెహరీన్ ఫిర్జాదా ఒకరు. నానికి జోడిగా ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఆమె ఆ తర్వాత రాజా ది గ్రేట్, ఎఫ్2, ఎఫ్3 సినిమాలతోపాటు తమిళం, హిందీ, కన్నడ భాషల్లోనూ నటించింది. ఇక మూవీస్ విషయం పక్కనపెడితే.. మెహరీన్ పంజాబ్ మాజీ సీఎం మనవడు భవ్య భీష్ణోయ్తో ఎంగేజ్మెంట్ చేసుకోగా ఇది పెళ్లి దాకా వచ్చి ఆగిపోయింది. అయితే దీనిపై రకరకాలుగా వార్తలొచ్చాయి.
అయితే తాజాగా వినిపిస్తున్న కథనాల ప్రకారం టాలీవుడ్ యంగ్ డైరెక్టర్‌తో మెహరీన్ ఎఫైర్ పెట్టుకుందని తెలుస్తోంది. ‘ఎఫ్2’ మూవీ నుంచి అనిల్ రావిపూడితో సన్నిహితంగా ఉండేదట. అదే సమయంలో వీరిద్దరి మధ్య రిలేషన్ నడుస్తున్నట్లు వార్తలొచ్చాయి. దీంతో మెహరీన్ ఎంగేజ్మెంట్ బ్రేక్ అయినట్లు తెలుస్తోంది. అంతేకాదు పెళ్లి తర్వాత సినిమాలు ఆపేయాలనే కండిషన్ పెట్టారట. దానికి కూడా ఆమె ఓకే చెప్పిందట. కానీ ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ధనుష్ మూవీ ఛాన్స్ వస్తే నటించిందట. దీంతో భవ్య భిష్ణోయ్‌తో మధ్య గొడవలు జరిగాయని, వీరిద్దరి పెళ్లి ఆగిపోవడానికి ఇది కూడా ఒక కారణం అని తెలుస్తోంది.
Read More: Niharika Konidela : భర్తను మర్చిపోయేందుకు ఆ పని చేస్తున్న నిహారిక..?