ఎన్టీఆర్ కారణంగా ఆ హీరో ప్రేమించిన అమ్మాయినీ వదులుకున్నాడా?
టాలీవుడ్‌లో దాదాపు 30 సినిమాలకు పైగా నటించి.. లవర్ బాయ్‌గా ఇమేజ్ సొంతం చేసుకున్నాడు హీరో వడ్డే నవీన్.
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్‌లో దాదాపు 30 సినిమాలకు పైగా నటించి.. లవర్ బాయ్‌గా ఇమేజ్ సొంతం చేసుకున్నాడు హీరో వడ్డే నవీన్. ప్రస్తుతం ఈ నటుడు సినిమాలకు దూరమయ్యాడు. అంతేకాకుండా సోషల్ మీడియాలో కూడా ఎక్కడ కనిపించడం లేదు. అయితే ఈ హీరో అప్పట్లో శ్రీదేవి కజిన్ సిస్టర్ మహేశ్వరిని ఇష్టపడ్డారట. వీరిద్దరి కాంబినేషన్‌లో మా బాలాజీ అనే సినిమా కూడా వచ్చింది. అనంతరం వీరిద్దరు మరింత ప్రేమలో మునిగిపోయి.. కొన్నాళ్లు డేటింగ్‌లో కూడా ఉన్నారంటూ వార్తలు వినిపించాయి.
తర్వాత నవీన్ నటించిన నాలుగైదు మూవీస్ ఫ్లాప్ కావడంతో తండ్రి వడ్డె రమేష్ డబ్బు ఉంటే సరిపోదు సినీ బ్యాక్‌గ్రౌండ్ కూడా ఉండాలంటూ తనకు స్నేహితుడైన సీనియర్ ఎన్టీఆర్ మనవరాలు చాముండేశ్వరిని వడ్డె నవీన్‌కు ఇచ్చి వివాహం చేశారట. తండ్రి మాట కాదనలేక ప్రేమించిన అమ్మాయిని వదులుకున్న నవీన్ చాముండేశ్వరితో ఎక్కువ రోజులు కలిసి జీవించలేకపోయాడు. మనస్పర్థాల కారణంగా వీరిద్దరు డివోర్స్ తీసుకున్నారు. ఈ న్యూస్ ఎంతవరకు నిజమో తెలియదు కానీ ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.