నాగార్జునను అందంగా చూపించడానికి దర్శకుడు అన్ని పాట్లు పడ్డారు..?
అరవై దాటినా 20 ఏళ్ల కుర్రాడిలా కనిపించే కింగ్ నాగార్జున.. ఇండస్ట్రీకి ఎంటర్ అయిన కొత్తలో అందంగా కనిపించేందుకు చాలా కష్టాలు పడ్డాడని తెలుస్తుంది.
దిశ, సినిమా: అరవై దాటినా 20 ఏళ్ల కుర్రాడిలా కనిపించే కింగ్ నాగార్జున.. ఇండస్ట్రీకి ఎంటర్ అయిన కొత్తలో అందంగా కనిపించేందుకు చాలా కష్టాలు పడ్డాడని తెలుస్తుంది. సాధారణంగా యంగ్ ఏజ్‌లో హీరోగా పరిచయమైన చాలా మంది ఇదే సమస్య ఎదుర్కుంటారు. బక్కపలుచగా ఉండటంతో చిన్న పిల్లాడిలా కనిపించడం.. హీరోయిన్ పక్కన నిల్చుంటే అస్సలు బాగాలేకపోవడం లాంటివి జరుగుతుంటాయి. సేమ్ ప్రాబ్లమ్ నాగార్జున కూడా ఎదుర్కొన్నాడట. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో ఓ సినిమా ఫైనలైజ్ అయినప్పుడు.. స్క్రీన్ ప్రజెన్స్ బాగుండాలంటే కాస్త లావు కావాలని నాగ్‌కు సూచించాడట డైరెక్టర్. కానీ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యే టైమ్‌కు కూడా అనుకున్న రిజల్ట్ రాకపోవడంతో.. తెరపై లావుగా కనిపించేందుకు షర్ట్, ప్యాంట్లో స్పాంజ్ కుక్కి కస్ట్యూమ్స్ రెడీ చేయించారట. అవి వేసుకున్న నాగార్జున అందంగా కనిపించినా.. షూటింగ్ టైమ్‌లో మాత్రం ఇబ్బందిపడ్డాడట.