జబర్దస్త్ రాకేష్ తన భార్య కోసం అంత పని చేశాడా..?
బుల్లితెరపై రీల్ జంటగా కొనసాగుతూనే రియల్ కపుల్‌గా మారిపోయినవారు చాలా మందే ఉన్నారు. ఇందులో జబర్దస్త్ రాకేష్, సుజాత పెయిర్ కూడా ఒకటి. చాలా కాలం జబర్దస్త్‌లో కొనసాగుతూనే.. ప్రేమపెళ్లితో
దిశ, సినిమా: బుల్లితెరపై రీల్ జంటగా కొనసాగుతూనే రియల్ కపుల్‌గా మారిపోయినవారు చాలా మందే ఉన్నారు. ఇందులో జబర్దస్త్ రాకేష్, సుజాత పెయిర్ కూడా ఒకటి. చాలా కాలం జబర్దస్త్‌లో కొనసాగుతూనే.. ప్రేమపెళ్లితో ఒక్కటయ్యారు. అయితే తాజాగా ఓ చానెల్‌లో రాబోతున్న ప్రోగ్రామ్‌లో రీల్ అండ్ రియల్ కపుల్ పాల్గొన్నారు. ఇందులో భాగంగా స్టేజ్ పైనే సుజాత పేరును చేతి మీద టాటూగా వేయించుకున్నాడు రాకేష్. అయితే ఆ టాటూని పొడిగిస్తూ ఉంటే రాకేష్ కన్నీరు పెట్టుకున్నాడు. దీంతో సుజాత ఎమోషనల్ అవుతూ.. ‘మామూలుగా జ్వరం వస్తే చిన్న ఇంజక్షన్ వేయించుకోవడానికి చాలా భయపడేవాడు. అలాంటిది ఇంత నొప్పిని భరిస్తూ టాటూ వేయించుకున్నాడు’ అని చెప్తూ సుజాత కంటతడి పెట్టుకుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో వైరల్ అవుతోంది.
Read More: చైనా స్కూల్లో మెగాస్టార్‌పై ప్రజెంటేషన్.. చప్పట్లతో అభినందించిన స్టూడెంట్స్