Raayan Movie: తెలుగులో హిట్ కొట్టిన ధనుష్ రాయన్ .. ఎంత లాభం వచ్చిందంటే..?

ధనుష్ డైరెక్టర్ గా, హీరోగా నటించిన కొత్త మూవీ ‘రాయన్’.

Update: 2024-08-02 11:25 GMT

దిశ, సినిమా: ధనుష్ డైరెక్టర్ గా, హీరోగా నటించిన కొత్త మూవీ ‘రాయన్’. పూర్తి గ్యాంగ్‌స్టర్‌ నేపథ్యంలో రూపొందించిన ఈ మూవీ జులై 26న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకొచ్చింది. అన్ని సెంటర్లలో పాజిటివ్ టాక్ తెచ్చుకుని మంచి కలెక్షన్స్ తో దూసుకెళ్తుంది. ఈ సినిమాలో ధనుష్ తో పాటు తెలుగు హీరో సందీప్ కిషన్ కూడా ముఖ్య పాత్రలో నటించాడు. విడుదలకు ముందే టీజర్, ట్రైలర్స్ ప్రేక్షుకులు బాగా ఆకట్టుకున్నాయి. రిలీజ్ అయినా ఫస్ట్ డే నుంచి పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్స్ కూడా అదే రేంజ్లో వసూలు చేసాయి. ఆరు రోజులు కలెక్షన్స్ చూసుకుంటే..

నైజాం - 02.30 CR

సీడెడ్ - 0.44 CR

ఉత్తరాంధ్ర - 0.50 CR

ఈస్ట్ - 0.29 CR

వెస్ట్ - 0.15 CR

గుంటూరు - 0.32 CR

కృష్ణా - 0.30 CR

నెల్లూరు - 0.16 CR

ఏపి+తెలంగాణ - 04.46 CR

రాయన్ సినిమాకి తెలుగులో రూ.02.10 కోట్లు బిజినెస్ జరిగింది. ఆరు రోజుల్లో రూ.04.46 కోట్ల షేర్ ని రాబట్టింది. బ్రేక్ ఈవెన్ సాధించి రూ. 01.86 కోట్ల ప్రాఫిట్స్ ను కూడా అందించి సూపర్ హిట్ గా నిలిచింది. ఈ మూవీ ధనుష్ కెరియర్లో 50 వ మూవీగా వచ్చిన మనకి విషయం తెలిసిందే. ఈ హిట్ తో తెలుగులో తన మార్కెట్ ని పెంచుకోవాలని హీరో ధనుష్ ప్రయత్నాలు చేస్తున్నాడు.

Tags:    

Similar News