వసూళ్ల సునామీ సృష్టించిన దేవర.. ఎన్టీఆర్ కెరీర్ లోనే భారీ కలెక్షన్స్

Update: 2024-09-29 06:36 GMT

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరో జూ. ఎన్టీఆర్(NTR) హీరోగా.. ప్రముఖ దర్శకుడు కొరటాల శివ(Koratala shiva) దర్శకత్వంలో ఈ నెల 27న ప్రపంచవ్యాప్తంగా దేవర(Devara) రిలీజ్ అయింది. అడ్వాన్స్ బుకింగ్స్‌తోనే చరిత్ర మొదలు పెట్టిన దేవర సినిమా.. మొదటి రోజే.. 172 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది.మొదటి షో నుంచి పాజిటివ్, హిట్ టాక్‌ను సొంతం చేసుకున్న ఈ సినిమా రెండో రోజు కూడా భారీ వసూళ్లను రాబట్టింది. RRR సినిమాను మినహాయిస్తే.. ఎన్టీఆర్ సోలో హీరోగా వచ్చి ఆరు సంవత్సరాలు అవుతుంది. దీంతో ఆకలిమిద ఉన్న ఫ్యాన్స్‌కు కొరటాల శివ.. భారీ వింధు భోజనం పెట్టాడని.. విశ్లేషకులు చెప్పడంతో.. బాక్సాఫీస్ వద్ద దేవర సినిమా రికార్డులు బద్దలు కొడుతుంది. కేవలం రెండు రోజుల్లోనే 243 కోట్లు వసూలు చేసినట్లు.. చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. కాగా RRR మల్టీస్టారర్ కావడంతో.. ఆ సినిమాను మినహాయిస్తే ఆయన కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు సాధించిన తొలి చిత్రంగా దేవర నిలిచిపోయింది. ఇదిలా ఉంటే ఈ రోజు ఆదివారం కావడం, అక్టోబర్ 2 నుంచి స్కూళ్లకు హాలీడేస్ ఉండటం.. ఈ సినిమాకు కలిసొచ్చే అవకాశం ఉంది. దీంతో దేవర బాక్సాఫీస్ వద్ద 500 కోట్ల వసూలు చేసే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.


Similar News