Devara Movie: ఫస్ట్ వీకెండ్ హయ్యస్ట్ రికార్డ్ క్రియోట్ చేసిన దేవర..

ఫస్ట్ వీకెండ్ హయ్యస్ట్ రికార్డ్ క్రియోట్ చేసిన దేవర..

Update: 2024-09-30 07:15 GMT

దిశ , వెబ్ డెస్క్ : యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఇతనికి రికార్డులు బ్రేక్ చేయడం కొత్తేమి కాదు.. యంగేజ్ లోనే “ఆది” సినిమాతో రికార్డులు తిరగరాసిన చరిత్ర ఒక్క ఎన్టీఆర్ దే అని చెప్పుకోవాలి. ఆ తర్వాత మళ్లీ “సింహాద్రి” తో కొత్త రికార్డులు క్రియోట్ చేసాడు. మళ్లీ ఇన్నేళ్లకు “దేవర" మూవీతో పాత రికార్డులు బ్రేక్ చేయడమే కాకుండా .. కొత్తవి కూడా దేవరతో సృష్టిస్తున్నాడు.

మొదటిరోజు రూ. 172 కోట్ల  గ్రాస్ కలెక్షన్స్ రాగా, ఫస్ట్ వీకెండ్ లో రూ. 304 కోట్లు  కలెక్ట్ చేసి ఎన్టీఆర్ సినీ కెరియర్లోనే హయ్యస్ట్ ఫస్ట్ వీక్ రికార్డ్ నమోదు చేసింది.

ఓ వైపు మిక్స్డ్ టాక్ నడుస్తుంది.. ఇంకో వైపు కలెక్షన్స్ జోరు మాత్రం తగ్గడం లేదు.. రోజు రోజు కి టాక్ మారడంతో ఇంకా భారీగా పెరిగిన ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. మన తెలుగులో దేవరకి ప్రమోషన్స్ చాలా తక్కువే జరిగాయి.. కానీ, కలెక్షన్స్ ఈ రేంజ్లో వస్తాయని ఎవరూ కూడా ఊహించలేదు. ఎన్టీఆర్ స్టార్ డం, ప్రీరిలీజ్ బజ్ కారణంగా ఫస్ట్ వీకెండ్ భారీ కలెక్షన్స్ రాబట్టింది. “ఆచార్య”తో బోల్తా పడిన కొరటాల శివకి  “దేవర” రిజల్ట్ ప్రాణం పోసిందనే చెప్పాలి. మొన్నటి వరకు ఈ డైరెక్టర్ మీద ఎన్నో ట్రోల్స్ వచ్చాయి దేవర రిలీజ్ తర్వాత తగ్గిపోయాయి.

Read More : నా భార్య ఆ విషయంలో కాంప్రమైజ్ అయిందంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన ఎన్టీఆర్

Tags:    

Similar News