'Veerasimha Reddy' వేడుకకు అనుమతి నిరాకరణ.. కారణమదేనా?

వీరసింహారెడ్డి సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు పోలీసులు అనుమతి నిరాకరించారు.

Update: 2023-01-05 02:02 GMT

దిశ, వెబ్ డెస్క్: బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు తొలుత నిర్ణయించిన ప్రదేశంలో నిర్వహించుకునేందుకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఒంగోలులోని ఏబీఎం కళాశాల మైదనాంలో ఈనెల 6న వేడకను నిర్వహించేందుకు సినిమా బృందం ఏర్పాట్లు చేసుకుంటోంది. అయితే ఈ ఏర్పాట్లు తుదిదశకు చేరుకునే సమయంలో పోలీసులు షాక్ ఇచ్చారు. వేడుకను అక్కడ నిర్వహించొద్దని తెలిపారు. ఏబీఎం కళాశాల మైదానానికి రెండు వైపులా ఉండే రహదారులు ఒంగోలు రైల్వేస్టేషన్, కార్పొరేట్ వైద్యకళాశాల ఉండటంతో ప్రయాణికులు, రోగులకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని దీంతో అనుమతి నిరాకరంచినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు.

దీంతో తాము ప్రత్యామ్నాయ స్థలం చూసుకుంటామని తమకు అనుమతి ఇవ్వాలని వేడుకు నిర్వహిస్తున్న ఓ సంస్థ కోరింది. త్రోవగుంట రోడ్డులోని బీఎంఆర్ అర్జున్స్ ఇన్ ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ స్థలాన్ని పోలీసులతో కలిసి పరిశీలించారు. ఆ స్థలంలో వేడుక నిర్వహణకు పోలీసులు అనుమతించారు. రాజకీయ కారణాలతో వేడకను అడ్డుకుంటున్నారని సోషల్ మీడియా వేదిక టీడీపీ కార్యకర్తలు మండిపడుతున్నారు. అయితే ఏపీలో రోడ్లపై సభల నిర్వహణపై ఆంక్షలు విధిస్తూ వైసీపీ ప్రభుత్వం సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.  

Also Read....

సమంత ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. త్వరలోనే షూటింగ్‌ సెట్‌లోకి

Tags:    

Similar News