Deepika Padukone: పుట్టబోయే బిడ్డ కోసం షాకింగ్ నిర్ణయం తీసుకున్న దీపికా పదుకొణె.. అదేంటంటే?

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

Update: 2024-07-27 04:26 GMT

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన అందం, అభినయంతో అందరినీ ఆకట్టుకుంటుంది. రీసెంట్‌గా కల్కీలో నటించి తన నటనతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్నది. ఇలా బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్న ఈ బ్యూటీ త్వరలోనే తల్లి కాబోతున్న విషయం అందరికీ తెలిసిందే. అటూ సినిమాలు చేస్తూనే, ఇటు తల్లి కాబోతున్న మధుర క్షణాలను ఆస్వాదిస్తుంది. అంతే కాకుండా సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ తన బేబీ బంప్‌తో ఉన్న ఫొటోలు షేర్ చేస్తూ ఉంటుంది. అయితే ఇక త్వరలో తల్లి కాబోతున్న ఈ బ్యూటీ తనకు పుట్టబోయే బిడ్డ విషయంలో ఓ సంచలన నిర్ణయం తీసుకుందట. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త నెట్టింట వైరల్ అవుతుంది.

దీపిక బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఆమె తన బేబితో ఎక్కువ టైం స్పెండ్ చేయాలని కోరుకుంటుందట. అలాగే ఇతర సెలెబ్రిటీల మాదిరి కేర్ టేకర్స్‌ను పెట్టుకోకుండా తన బేబీని చూసుకోవాలనుకుంటుందట. అంతేకాదు తన భర్త రణవీర్ సింగ్ నుంచి కూడా సహాయం తీసుకోదని తెలుస్తోంది. ఎందుకంటే తన బిడ్డకు కావాల్సిన ప్రతి విషయాన్ని తానే స్వయంగా చేయాలనుకుంటుందట. దీంతో కోట్ల ఆస్తి ఉన్నప్పటికీ బిడ్డను కేర్ టేకర్ చేతిలో పెట్టేసే హీరోయిన్లు దీపికాను చూసి బుద్ధి తెచ్చుకోవాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

కాగా దీపిక ప్రెగ్నెన్సీ కారణంగా అంతర్జాతీయ వెబ్ సిరీస్ ‘ది వైట్ లోటస్’ మూడవ సీజన్‌ ఆఫర్‌ను కూడా తిరస్కరించింది. అంతేకాదు ప్రస్తుతం ఆమె ఎలాంటి కొత్త ప్రాజెక్ట్‌కు కూడా సంతకం చేయడం లేదని సమాచారం.

Tags:    

Similar News