మొన్న ప్రభాస్ - నిన్న అనుష్క.. ఆ విషయంలో ఇద్దరిది సేమ్ రియాక్షన్!

కన్నడ స్టార్ రిషబ్ శెట్టి డైరెక్ట్ చేసి నటించిన తాజా చిత్రం' కాంతార'. ఈ సినిమా సెప్టెంబర్ 30న విడుదలై ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. భారీ కలెక్షన్లతో ఇండియన్ బాక్సాఫీసును షేక్ చేస్తోంది.. Latest Telugu News

Update: 2022-10-17 03:28 GMT

దిశ, వెబ్‌డెస్క్: కన్నడ స్టార్ రిషబ్ శెట్టి డైరెక్ట్ చేసి నటించిన తాజా చిత్రం' కాంతార'. ఈ సినిమా సెప్టెంబర్ 30న విడుదలై ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. భారీ కలెక్షన్లతో ఇండియన్ బాక్సాఫీసును షేక్ చేస్తోంది. అంతేకాకుండా ఈ మూవీపై పలువురు సినీ ప్రముఖులు కూడా ప్రశంసలతో ఆకాశానికి ఎత్తేస్తున్నారు. కాగా, తాజాగా ఈ చిత్రంపై టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఇంట్రెస్టింగ్ పోస్టు షేర్ చేసింది. ''కాంతారా సినిమా నాకు ఎంతగానో నచ్చింది. ఈ చిత్రంలో నటించిన ప్రతి నటీనటులకు, నిర్మాతలకు, సాంకేతిక నిపుణులకు నా అభినందనలు. ఇటువంటి సినిమా అందించినందుకు రిషబ్ శెట్టి గారికి నా ధన్యవాదాలు. దయచేసి ఈ సినిమాని థియేటర్లలో చూడండి'' అంటూ చెప్పుకొచ్చింది. కాగా, రెండ్రోజుల క్రితం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కూడా ఈ సినిమా రెండోసారి చూసాను. చాలా బావుంది. ప్రేక్షకులంతా థియేటర్లలో సినిమా చూడండి అంటూ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి : ఆరుగురు అగ్ర హీరోలతో సెన్సేషనల్ మూవీ.. రామ్ చరణ్‌దే కీలక పాత్ర?


Similar News