OTT: ఓటీటీలోకి క్రేజీ సస్పెన్స్ థ్రిల్లర్.. ఎక్కడ చూడొచ్చంటే..?

ఓటీటీలోకి క్రేజీ సస్పెన్స్ థ్రిల్లర్

Update: 2024-08-09 09:46 GMT

దిశ, సినిమా : ఈ మధ్య చాలా సినిమాలు థియేటర్ కంటే ఓటీటీలోకే నేరుగా వచ్చేస్తున్నాయి. అక్కడికి వెళ్ళి చూడటం కన్నా ఇంటి దగ్గర చూడటం చాలా బెస్ట్ అని ఓటీటీలో వచ్చిన ఏ సినిమాని కూడా వదలకుండా చూస్తున్నారు. రవికృష్ణ, సమీర్ మళ్లా లీడ్ రోల్లో నటించిన లేటెస్ట్ మూవీ ‘ది బర్త్‌డే బాయ్‌’.

ఈ సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ జులై 19న థియేటర్లలో రిలీజ్ అయింది. బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ లేకపోయినా ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలోకి వచ్చింది. నేటి నుంచి ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలో ‘ది బర్త్‌డే బాయ్‌’ స్ట్రీమింగ్ కానుంది.

‘ఆహా’ ఈ మూవీ గురించి అధికారికంగా వెల్లడించింది. విస్కీ దాసరి డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీకి ప్రశాంత్ శ్రీనివాస్ సంగీతాన్ని అందించారు. ఈ మూవీలోని కొన్ని ఎమోషన్ సీన్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. థియేటర్స్ లో యావరేజ్ గా రన్ అయినా ఓటీటీలో రికార్డ్స్ బ్రేక్ చేసే అవకాశాలు ఉన్నాయి.

Tags:    

Similar News