ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుంచి బిగ్ అప్‌డేట్
టాలీవుడ్‌లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు.
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్‌లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. పవన్ కల్యాణ్ కొత్త సినిమా నుంచి ఏదైనా అప్‌డేట్ వస్తుందంటే అభిమానుల్లో జోష్ మామూలుగా ఉండదు. ఆటు రాజకీయాలపై ధీటుగా ఫోకస్ పెడుతూనే.. సినిమాల్లో కూడా రాణిస్తున్నాడు. అయితే పవర్ స్టార్ ఇప్పటికే కొత్త రెండు సినిమాల్లో వస్తున్న విషయం తెలిసిందే. అందులో ఒకటి ఉస్తాద్ భగత్ భగత్ సింగ్ సినిమాకు హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో పవన్‌కి గబ్బర్‌సింగ్ లాంటి భారీ బ్లాక్ బస్టర్ అందించడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. కాగా, మూవీ నుంచి అభిమానులకు అప్‌డేట్ ఇచ్చారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రాపర్ ప్రణవ్ చాగంటి ఈ సినిమాలో టైటిల్ ట్రాక్ రాసుకున్నట్లు వెల్లడించారు. పవన్ కళ్యాణ్ కెరీర్‌లో ఇది బెస్ట్ టైటిల్ ట్రాక్ అవుతుందని.. ఇంత పెద్ద అవకాశం ఇచ్చిన దర్శకుడికి కృతజ్ఞతలు తెలిపారు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ షూటింగ్ ప్రారంభం కానుండగా.. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు.
Also Read: Unstoppable-2: పవన్-బాలయ్య ఎపిసోడ్ అప్‌డేట్ (వీడియో)