Pushpa-2: కౌంట్‌డౌన్ స్టార్ట్.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న ‘పుష్ప-2’ న్యూ పోస్టర్

అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘పుష్ప-2’. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ ‘పుష్ప’ మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కుతోంది.

Update: 2024-08-28 10:43 GMT

దిశ, సినిమా: అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘పుష్ప-2’. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ ‘పుష్ప’ మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కుతోంది. ఇందులో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తుండగా.. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఇప్పటికే పుష్ప-2 నుంచి వచ్చిన పోస్టర్స్, గ్లింప్స్, ఫస్ట్ సింగిల్ భారీ అంచనాలు పెంచేశాయి. అయితే పుష్ప-2 మూవీ ఆగస్టులో విడుదల కావాల్సి ఉండగా.. షూటింగ్ పూర్తి కాకపోవడంతో వాయిదా పడిన విషయం తెలిసిందే. డిసెంబర్ 6న వరల్డ్ వైడ్‌గా విడుదల కాబోతుంది. దీంతో ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ పుష్ప-2 అప్డేట్స్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

ఈ క్రమంలో.. తాజాగా, మైత్రీ మూవీ మేకర్స్ ట్విట్టర్ వేదికగా అదిరిపోయే పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో అల్లు అర్జున్ ముఖం పూర్తిగా కనిపించకుండా సైడ్‌కు నిల్చొని నమస్తే పెట్టినట్లు ఉండగా.. కళ్లల్లో పవర్ కనిపిస్తున్నట్లు ఉంది. అయితే ఈ పోస్టర్‌పై 100 రోజుల్లో పుష్ప రూలింగ్ అని రాసుకొచ్చారు. అలాగే ‘‘ఇంకా 100 రోజులే ఉంది పుష్ప-2 రిలీజ్ కావడానికి. అద్భుతమైన అనుభూతి పొందేందుకు రెడీగా ఉండండి’’ అనే క్యాప్షన్ జత చేశారు. ఇక ఈ పోస్టర్ చూసిన ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ లుక్ గూస్ బంప్స్ వచ్చేలా ఉంది అని కామెంట్లు చేస్తున్నారు. అంతేకాకుండా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Mythri Movie Makers Twitter Post : https://x.com/MythriOfficial/status/1828728080703115316

Tags:    

Similar News