Ramgopal Varma: ‘వ్యూహం’ ప్రారంభం.. వైఎస్ జగన్, భారతి స్టిల్స్ రివీల్

ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన ‘వ్యూహం’ సినిమా నటీ నటులను పరిచయం చేశారు...

Update: 2023-06-01 14:33 GMT
Ramgopal Varma: ‘వ్యూహం’ ప్రారంభం.. వైఎస్ జగన్, భారతి  స్టిల్స్ రివీల్
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన ‘వ్యూహం’ సినిమా నటీ నటులను పరిచయం చేశారు. రాజకీయం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ ‘వ్యూహం’ సినిమాలో వైఎస్ జగన్ పాత్రలో అజ్మల్ అమీర్, వైఎస్ భారతి పాత్రలో మానస రాధాకృష్ణన్ నటిస్తున్నారు. వైఎస్ జగన్, వైఎస్ భారతి పోలి ఉండే హీరో, హీరోయిన్ సీన్‌కు సంబంధించిన పిక్‌ను విడుదల చేశారు.


ఈ మూవీని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. మొదటిది వ్యూహం, రెండోది శపథం పేరుతో ఈ మూవీని రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన స్టిల్స్‌ను రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. ఈ మూవీ బయోపిక్ కాదని, రియల్ పిక్ అని రాంగోపాల్ వర్మ గతంలోనే ప్రకటించారు.

Also Read..

ఆ కండీషన్ ఒప్పుకున్నాకే, లావణ్యతో పెళ్లికి వరుణ్ తేజ్ ఒకే చెప్పాడా?

Tags:    

Similar News