విమానంలో లభించిన కండోమ్‌లు, లోదుస్తులు.. షాకింగ్ విషయాలు రివీల్ చేసిన ఫ్లైట్ అటెండర్
25 ఏళ్ల నుంచి అమెరికన్ ఎయిర్‌లైన్‌లో పనిచేస్తున్న ఓ ఫ్లైట్ అటెండర్ తాజాగా ప్రయాణికుల గురించి షాకింగ్ విషయాలు బయటపెట్టాడు.
దిశ, ఫీచర్స్: 25 ఏళ్ల నుంచి అమెరికన్ ఎయిర్‌లైన్‌లో పనిచేస్తున్న ఓ ఫ్లైట్ అటెండర్ తాజాగా ప్రయాణికుల గురించి షాకింగ్ విషయాలు బయటపెట్టాడు. విమానంలో కండోమ్‌లు, మురికిగా ఉన్న లోదుస్తులు, ప్రయాణికులు యూజ్ చేసిన టాంపాన్‌లు లభించాయని ఫ్లైట్ అటెండర్ వెల్లడించారు. అలాగే విమాన సిబ్బందికి ఒత్తిడికి మెయిన్ రీజన్ ప్రయాణికులేనని అన్నారు.
ప్రయాణికులు ఎవరి మాట వినరు. టాయిలెట్‌లో కూడా సిగరేట్ తాగుతారు. స్మోక్ చేసే వారిని చాలా సార్లు పట్టుకున్నాం కూడా. విమానంలో పొగ తాగడం వల్ల తోటి ప్రయాణికులకే కాకుండా ఫ్లైట్‌కు కూడా ప్రమాదమని ఎంత చెప్పిన వారు అస్సలు వినిపించుకోరు. కొంతమందైతే మద్యం కూడా సేవిస్తారు. మద్యం మత్తులో ప్రయాణికులు గందరగోళం సృష్టించిన రోజులు కూడా ఉన్నాయి. ప్రతి ఆరు నెలలకోసారి ఈ సమస్యను ఎదుర్కొంటాం.
సమ్‌టైమ్స్ ప్రయాణికులు తమ సీట్ల కోసం గొడవ పడతారు. అక్కడక్కడే మరుగుదొడ్డి కూర్చోవడం లాంటివి చేస్తారు. ఒకసారి ఓ ప్రయాణికుడు నాపై ఉమ్మి వేయడానికి కూడా ట్రై చేశాడు. ఫ్లైట్ అటెండర్ తన 25 ఏళ్ల చెదు అనుభవాలను షేర్ చేసుకుంటూ ఇవన్నీ భరించుకుంటూ వస్తున్న జీతం కూడా చాలా తక్కువ అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఫ్లైట్ అటెండర్ ఎమోషనల్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.