పూర్తైన కంగనా చంద్రముఖి 2 షూటింగ్.. కన్నీళ్లు ఆగట్లేదంటూ పోస్ట్
రజినికాంత్ చంద్రముఖి మూవీని ఎవరూ ఇప్పటికీ మర్చిపోలేరు. ఇక చాలా రోజుల తర్వాత ఈ మూవీకి సీక్వెల్ వస్తున్న విషయం తెలిసిందే. ఇందులో లారెన్స్, కంగనా
దిశ, వెబ్‌డెస్క్ : రజినికాంత్ చంద్రముఖి మూవీని ఎవరూ ఇప్పటికీ మర్చిపోలేరు. ఇక చాలా రోజుల తర్వాత ఈ మూవీకి సీక్వెల్ వస్తున్న విషయం తెలిసిందే. ఇందులో లారెన్స్, కంగనా రనౌత్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇందులో కంగనా చంద్రముఖి పాత్రలో కనిపించబోతుంది.
అయితే ఈ సినిమాలోని కంగనా పాత్ర షూటింగ్ పూర్తైంది. ఈక్రమంలో కంగనా ఎమోషనల్ పోస్టు చేసింది. లారెన్స్‌తో కలిసి దిగిన ఫొటోనూ షేర్ చేస్తూ.. ఇవాల్టితో చంద్రముఖి2లో నా పాత్ర షూటింగ్ పూర్తైంది. నాకు సహకరించిన మూవీ టీంకు కృతజ్ఞతలు, లారెన్స్ గొప్ప డ్యాన్స్ మాస్టర్, దర్శకుడు, నటుడు కూడా, సెట్‌లో నన్ను బాగా చూసుకున్నందుకు, నవ్వించినందుకు థాక్యూసర్. మీతో పని చేయడం నాకు గొప్పవిషయం, మీ అందరినీ వదలి వెల్లాలంటే చాలా బాధగా అనిపిస్తుంది. ఒక ఫ్యామిలీలా నాతో ఉన్నారు. మిమ్ముల్ని వదిలి వెళ్తున్నందుకు నా కన్నీళ్లు ఆగట్లేదంటూ పోస్టు చేసింది.
Also read: పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన బిగ్ బాస్ బ్యూటీ ప్రియాంక.. అప్పుడేనంట?