స్టార్ నటుడి కుమార్తె పెళ్లి.. సోషల్ మీడియాను షేక్ చేస్తోన్న ఫొటోలు
తనదైన శైలిలో కామెడీ టైమింగ్‌తో అందరినీ నవ్వించిన నటుడు వివేక్. కోలీవుడ్‌కు చెందిన ఈ స్టార్ కమెడియన్.. టాలీవుడ్‌కూ సుపరిచితుడే.
దిశ, వెబ్‌డెస్క్: తనదైన శైలిలో కామెడీ టైమింగ్‌తో అందరినీ నవ్వించిన నటుడు వివేక్. కోలీవుడ్‌కు చెందిన ఈ స్టార్ కమెడియన్.. టాలీవుడ్‌కూ సుపరిచితుడే. ముఖ్యంగా బోయ్స్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయ్యారు. రజనీకాంత్ శివాజీ మూవీ, ధనూష్ నటించిన బీటెక్ రఘువరన్ సినిమాలతో వివేక్.. తెలుగు నటుల్లో ఆయన ఒకరిగా నిలిచిపోయారు. కాగా ఆయన 2021లో గుండెపోటు కన్నుమూశారు.
సినిమాల్లోనే నటిస్తూనే అబ్దుల్ కలామ్‌ను ఆదర్శంగా తీసుకున్న వివేక్ ఎన్నో స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేపట్టారు. ముఖ్యంగా పర్యావరణ పరిరక్షణ కోసం ఎంతో కృషి చేశారు. వేలాది మొక్కలను నాటి అభిమానుల్లో స్ఫూర్తిని నించారు. ఏ కార్యక్రమం చేపట్టినా మొక్కను నాటడం వివేక్ అలవాటుగా మార్చుకున్నారు.
కాగా, గురువారం వివేక్ కుమార్తె తేజస్వినిలో వివాహం జరిగింది. చెన్నైలోని విరుగంబాక్కం పద్మావతి నగర్‌లోని వివేక్ నివాసంలో భరత్ అనే యువకుడితో ఆమె వివాహం జరిగింది. ఈ వేడుకకు అతికొద్ది మంది బంధువులు, సన్నిహితులు హాజరుకాగా, చాలా సింపుల్‌గా వివాహ తంతుని జరిపించారు. ఈ సందర్భంగా నవదంపతులు తన తండ్రి జ్ఞాపకార్థంగా ఓ మొక్కను నాటారు.
ప్రకృతిని కాపాడటం తన తండ్రి కలని, ఆయన కల సాకారం కోసం తన వంతుగా ప్రకృతిని కాపాడుతానని తేజస్విని తెలిపారు. అనంతరం వివాహానికి హాజరైన బంధుమిత్రులకు మొక్కలను పంపిణీ చేశారు. కాగా, తేజస్విని-భరత్ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తన అభిమాన నటుడి కుమార్తె పెళ్లి ఫొటోలు చూసి ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Read More..
ఆ కారణంగా ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపా.. స్టార్ హీరోయిన్ సెన్సేషనల్ కామెంట్స్