Thangalaan Movie: ఓటీటీలోకి రాబోతున్న చియాన్ విక్రమ్ ‘తంగలాన్’ మూవీ
ఓటీటీలోకి రాబోతున్న చియాన్ విక్రమ్ ‘తంగలాన్’ మూవీ
దిశ, వెబ్ డెస్క్: కోలీవుడ్ స్టార్ చియాన్ విక్రమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ హీరో తాజాగా నటించిన లేటెస్ట్ సినిమా ‘తంగలాన్’. పీరియాడికల్ యాక్షన్ కథతో తెరకెక్కిన ఈ మూవీ ఆగస్టు 15న విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద మంచి రెస్పాన్స్ రావడంతో కలెక్షన్స్ కూడా అదే రేంజ్ లో వసూలు చేసాయి. ముఖ్యంగా, తంగలాన్ లో విక్రమ్ లుక్, ఆయన నటన ఆడియెన్స్ ను బాగా ఆకట్టుకుంది.
అయితే, థియేటర్లో మెప్పించిన ఈ మూవీ త్వరలో ఓటీటీలోకి రావడానికి సిద్ధమైంది. తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ను అధికారికంగా అనౌన్స్ చేసింది. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా ‘తంగలాన్’ సెప్టెంబర్ 20 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవ్వనుంది. ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీలో ఐదు భాషల్లో అందుబాటులోకి రానుంది. డిజిటల్ హక్కుల కోసం నెట్ ఫ్లిక్స్ రూ.35 కోట్లు డీల్ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. విక్రమ్ సినీ కెరీర్ లో ఇంత వరకు పాత్రలో ఈ సినిమాలో కనిపించారు.
Read More..
RGV Shari Teaser: భారీ అంచనాలు పెంచుతోన్న ఆర్జీవీ ‘శారీ’ టీజర్