Tarakaratna హెల్త్‌ కండిషన్‌పై చిరంజీవి ట్వీట్!

నటుడు, టీడీపీ నాయకుడు నందమూరి తారకరత్న హెల్త్‌ కండిషన్‌పై చిరంజీవి ట్వీట్ చేశారు.

Update: 2023-01-31 04:05 GMT

దిశ, వెబ్ డెస్క్: నటుడు, టీడీపీ నాయకుడు నందమూరి తారకరత్న హెల్త్‌ కండిషన్‌పై చిరంజీవి మంగళవారం ట్వీట్ చేశారు. 'నటుడు తారకరత్న త్వరగా కోలుకుంటున్నారు, ఇంక ఏ ప్రమాదం లేదు అనే మాట ఎంతో ఉపశమనాన్నిచ్చింది. తను త్వరలో పూర్తి స్థాయిలో కోలుకుని ఇంటికి తిరిగి రావాలని కోరుకుంటూ, ఈ పరిస్థితి నుండి కాపాడిన ఆ డాక్టర్లకి, ఆ భగవంతుడికి కృతజ్ఞతలు' అని కామెంట్ చేశారు. కాగా ఈ నెల 27న చిత్తూరు జిల్లా కుప్పంలో యువగళం పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న కొద్ది దూరం నడిచిన తర్వాత గుండెపోటుతో అకస్మాత్తుగా సొమ్మసిల్లి పడిపోయిన సంగతి తెలిసిందే. 

Also Read...

ICUలో తారకరత్న.. లేటెస్ట్ ఫొటో వైరల్ 

తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న హీరోయిన్ ఇలియానా.. 

Tags:    

Similar News