Chiranjeevi : సైకిల్ నేర్పిస్తున్న అమ్మాయితో ప్రేమలో పడిపోయిన చిరంజీవి.. చివరకు ఏమైందంటే?
మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన తన స్వయం కృషితో చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టి మెగాస్టార్‌గా నిలిచారు. కాగా, తాజాగా చిరుకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
దిశ, సినిమా : మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన తన స్వయం కృషితో చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టి మెగాస్టార్‌గా నిలిచారు. కాగా, తాజాగా చిరుకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. చిరు లవ్ స్టోరి ప్రస్తుతం నెట్టింట్లో హాట్ టాపిక్‌గా నిలిచింది.
చిరు టీనేజ్లోనే లవ్‌లో పడిపోయాడంట. దీని గురించి ఆయన మాట్లాడుతూ.. నాకు నిజ జీవితంలో లవ్ స్టోరీ ఉంది. ఆ అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం. ఏడో క్లాస్‌లోనే ఆమెను నేను ప్రేమించడం మొదలు పెట్టాను. ఆ సమయంలో సైకిల్ తొక్కుతూ ఆ అమ్మాయి మా ఇంటి ముందు నుంచి వెళ్లేది. నాకేమో సైకిల్ తొక్కడం రాదు. కానీ అమ్మాయి సైకిల్ తొక్కడం అంటే మొగల్తూరులో చాలా గొప్ప విషయం. ఇక తాను నా క్లాస్ మెంట్ కాబట్టి నేను మెల్లిగా పరిచయం పెంచుకున్న. అలా నాకు తను ఫ్రెండ్ అయ్యింది. ఆ సమయంలోనే నేను నాకు సైకిల్ నేర్పించమని అడిగాను, నేను సైకిల్ తొక్కుతుంటే ఆ అమ్మాయి పట్టుకొని మెల్లిగా, నాకు సైకిల్ తొక్కడం నేర్పించింది. ఆమె సైకిల్ తొక్కడం నేర్పిస్తున్న క్రమంలోన నేను తననే వన్ సైడ్‌లో చూస్తూ ఉండేవాడిని. కానీ ఎప్పుడూ ఆమెకు నేను నా లవ్ విషయం చెప్పలేదు. తర్వాత ఎవరి దారి వారిది అయిపోయింది. ఇప్పటికీ ఆ అమ్మాయి అంటే చాలా ఇష్టం అని తెలిపారు. లాల్ సద్దా సినిమా ప్రమోషన్స్ టైంలో చిరు ఈ విషయాన్ని వెల్లడించినట్లు సమాచారం.