చిరంజీవి కూతురు శ్రీజ-కళ్యాణ్ దేవ్.. తమ బిడ్డ కోసం మళ్లీ కలుస్తారా?
మొన్నటి వరకు కళ్యాణ్ దేవ్‌కి మెగా అల్లుడుగా మంచి గుర్తింపు లభించింది.
దిశ, సినిమా : మొన్నటి వరకు కళ్యాణ్ దేవ్‌కి మెగా అల్లుడుగా మంచి గుర్తింపు లభించింది. కానీ, ఎప్పుడైతే చిరంజీవి కూతురు శ్రీజతో విడాకులు తీసుకున్నట్లు టాక్ బయటకు వచ్చిందో..అప్పటినుంచి అతనికి గడ్డుకాలం మొదలైంది. మెగా అభిమానులు కళ్యాణ్ దేవ్‌కి ఏ విషయంలో సపోర్ట్ చేయడం లేదు. ఈ నేపథ్యంలో ఆయనపై విపరీతంగా రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు. విషయం ఏమిటంటే వీరిద్దరి డాటర్ నవిష్క ప్రస్తుతం శ్రీజ దగ్గరే ఉంటోంది. అయితే కళ్యాణ్ తాజాగా తన కుమార్తె వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ..'మై హార్ట్..మై సోల్..నా ప్రపంచం మొత్తం తానే. నేడు నా పాప పుట్టినరోజు..హ్యాపీ బర్త్ డే. నీకు క్రిస్మస్ శుభాకాంక్షలు. లవ్ యూ. నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నా. నిన్ను చూడక చాలా రోజులవుతోంది' అంటూ పోస్ట్‌లో రాసుకొచ్చాడు. కాగా ఈ వీడియో చూస్తే..తమ కూతురుకోసం మళ్లీ వారిద్దరూ కాంప్రమైజ్ అవుతారని అభిమానులు చెప్పుకుంటున్నారు.
ఇవి కూడా చదవండి : మూడు సెకన్లలోనే ఆ సినిమా చేస్తానని ఒప్పుకున్నా: Ranveer Singh