చిరంజీవి vs నాగార్జున.. గెలుపెవరిది?
దిశ, వెబ్‌డెస్క్: మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున మంచి సన్నిహితులు. ఇప్పటివరకు ఇద్దరి మధ్య సమస్య లేకుండా మిత్రులుగా కొనసాగుతున్నారు.
దిశ, వెబ్‌డెస్క్: మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున మంచి సన్నిహితులు. ఇప్పటివరకు ఇద్దరి మధ్య సమస్య లేకుండా మిత్రులుగా కొనసాగుతున్నారు. కానీ, ఇప్పుడు వాళ్లు ఇద్దరు నువ్వా!! నేనా!! అంటూ పోటీ పడనున్నారు. ఎందుకు అనుకుంటున్నారా..? మెగాస్టార్ చిరంజీవి ''గాడ్ ఫాదర్'', కింగ్ నాగార్జున ''ది ఘోస్ట్'' సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.
గాడ్ ఫాదర్, ది ఘోస్ట్ సినిమాల నుంచి రిలీజ్ అయినా ట్రైలర్స్ ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ సంపాదించుకున్నాయి. ఇక ఈ రెండు సినిమాలు దసరా సందర్భంగా అక్టోబర్ 5న ఒకేసారి బాక్సాఫీస్ బరిలో దిగనున్నాయి. దీంతో స్టార్ హీరోల ఫ్యాన్స్‌లో ఉత్కంఠ మొదలయ్యింది. ఢీ అంటే ఢీ అంటూ వచ్చే ఈ రెండు సినిమాల్లో ఏ మూవీ బాక్సాఫిస్ వద్ద సక్సెస్ సాధిస్తుందో రిలీజ్ వరకు వేచి చూడాల్సిందే.
Also Read : నాగార్జున రాజకీయాల్లోకి రాబోతున్నారా..?