Waltair Veerayya :సుమ షోలో మెగాస్టార్ చిరంజీవి.. ఎంట్రీకి కారణం ఏంటీ?

టాలీవుడ్ నెంబర్ వన్ యాంకర్ అంటే అందరికీ ముందుగా గుర్తు వచ్చే పేరు సుమ. ఈమె తన మాటలతో అందరినీ మాయ చేస్తోంది. ఇక సుమ

Update: 2023-01-07 08:06 GMT

దిశ, వెబ్‌డెస్క్ : టాలీవుడ్ నెంబర్ వన్ యాంకర్ అంటే అందరికీ ముందుగా గుర్తు వచ్చే పేరు సుమ. ఈమె తన మాటలతో అందరినీ మాయ చేస్తోంది. ఇక సుమ చేసిన చాలా షోలు పాపులర్ అయ్యాయి. ముఖ్యంగా క్యాష్ ప్రోగ్రాం మంచి సక్సెస్ అందుకుంది. అయితే ఇటీవల క్యాష్ ప్రోగ్రాం స్థానంలో, సుమ అడ్డా అనే కొత్త ప్రోగ్రాం స్టార్ట్ చేశారు. ఇక ఈ ప్రోగ్రామ్ మొదటి ఎపిసోడ్‌లో సంతోష్ శోభన్ సందడి చేయగా, సంక్రాంతి స్పెషల్ సెకండ్ ఎపిసోడ్‌లో ఊహించని హీరో గెస్ట్‌గా వచ్చారు.

ఇప్పటి వరకు ఎప్పుడూ ఏ బుల్లితెర షోలకు అటెండ్ కానీ మెగాస్టార్ చిరంజీవి రీసెంట్‌గా సుమ అడ్డా షోకు గెస్ట్‌గా రాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈయన సమంత టాక్ షోలో తప్పితే ఇంత వరకు ఏ షోకు అటెండ్ కాలే.కానీ తొలిసారి బుల్లితెర గేమ్ షోలో పాల్గొనబోతున్నాడని తెలిసి అభిమానులు ఆశ్చర్యానికి గురి అవుతున్నారు. అసలు చిరు ఎందుకు గేమ్ షోకు అటెండ్ అయ్యారని తమ అభిమానులు పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారు. ఇక సంక్రాంతి కానుకగా చిరంజీవి నటించి వాల్తేరు వీరయ్య సినిమా రిలీజ్ అవనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చిరు బుల్లితెర షోకు వచ్చి ఎలా సందడి చేయబోతున్నాడో అని అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

Tags:    

Similar News