గరికపాటి ఇష్యూపై చిరంజీవి వివరణ
గరికపాటి ఇష్యూపై వివరణ ఇచ్చారు మెగాస్టార్ చిరంజీవి. నిజం నిలకడ మీద తెలుస్తుందనే సంయమనంతో ఉంటానని తెలిపిన చిరు..
దిశ, సినిమా : గరికపాటి ఇష్యూపై వివరణ ఇచ్చారు మెగాస్టార్ చిరంజీవి. నిజం నిలకడ మీద తెలుస్తుందనే సంయమనంతో ఉంటానని తెలిపిన చిరు..తనతో గొడవలున్నాయని ఎవరిపై కక్ష సాధించే టైప్ తాను కాదని తనదైన స్టైల్‌లో వివరించారు. ఇంతకు ముందు రాజకీయాల్లోకి వస్తున్నానని తెలిసిన సమయంలో కొంత మంది తన బ్లడ్ బ్యాంక్‌పై రైడ్స్ చేయించి ఇరికించే ప్రయత్నం చేశారని, కానీ తాను వెంటనే రియాక్ట్ కాలేదన్నాడు. సదరు వ్యక్తులే తర్వాత తన దగ్గరకు వచ్చి మాట్లాడారని, చాలా సందర్భాల్లో ఇదే జరిగిందని చెప్పుకొచ్చాడు.