Chiranjeevi Konidela: ఇలా జరుగుతుందని నేను అస్సలు ఊహించలేదు.. ఎమోషనల్ ట్వీట్ చేసిన చిరంజీవి

టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి అరుదైన ఘనత సాధించి ప్రశంసలు అందుకుంటున్నారు.

Update: 2024-09-23 11:42 GMT

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి అరుదైన ఘనత సాధించి ప్రశంసలు అందుకుంటున్నారు. ఆయన గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం దక్కించుకున్న విషయం తెలిసిందే. 156 చిత్రాలలో 537 పాటల్లో 24 వేల డాన్స్ మూమెంట్స్ చేసినందుకు గానూ  అమీర్ ఖాన్ చేతుల మీదుగా  మోస్ట్ ప్రోలిఫిక్ ఫిలిం స్టార్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ కేటగిరీలో అవార్డ్ కూడా అందుకున్నారు. దీంతో ఈ విషయం తెలుసుకున్న అభిమానులు, సినీ ప్రముఖులు పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలో.. తాజాగా, గిన్నిస్ రికార్డ్ సాధించడంపై చిరంజీవి ట్విట్టర్ వేదికగా ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశాడు. ‘‘నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది. గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్‌ గురించి నేనెప్పుడూ ఊహించలేదు. ఇలా జరుగుతుందని కూడా అనుకోలేదు.

ఇన్నేళ్లుగా నాకు అవకాశాలు ఇచ్చిన నా నిర్మాతలు, దర్శకులు, అద్భుతమైన పాటలను కంపోజ్ చేసిన సంగీత దర్శకులు.. నాకు కొన్ని మరపురాని డ్యాన్స్ మూవ్‌లను అందించిన కొరియోగ్రాఫర్ల వల్లే ఘనత సాధ్యమైంది. నన్ను అమితంగా ప్రేమించి, నా డ్యాన్సులను ఇష్టపడిన ప్రతి ఒక్కరికీ ఇది అంకితం. ఈ ఘనత సాధించినందుకు నాకు శుభాకాంక్షలు తెలిపిన మిత్రులు, సహోద్యోగులు, నా ప్రియమైన అభిమానులందరికీ, కుటుంబ సభ్యులకు, సినీ ప్రముఖులకు, రాజకీయ నాయకులకు, మీడియా ప్రముఖులు, పాత్రికేయులు, మంత్రులు, ప్రజాప్రతినిధులు, పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్యేలు, అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు’’ అని రాసుకొచ్చాడు.


Similar News