Megastar Chiranjeevi :మీడియాకు స్ట్రాంగ్ వార్నింగ్.. మళ్లీ రిపీట్ కావద్దంటూ..!

మెగా స్టార్ చిరంజీవి తాజాగా ‘చిరంజీవి ఛారిటబల్ ట్రస్ట్’ ఆధ్వర్యంలో ఉచితంగా క్యాన్సర్ స్క్రీనింగ్ చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.

Update: 2023-06-24 08:37 GMT

దిశ, వెబ్‌డెస్క్: మెగా స్టార్ చిరంజీవి తాజాగా ‘చిరంజీవి ఛారిటబల్ ట్రస్ట్’ ఆధ్వర్యంలో ఉచితంగా క్యాన్సర్ స్క్రీనింగ్ చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. చెప్పిన విధంగానే జులై 9న హైదరాబాద్, జులై 16న వైజాగ్, జులై 23న కరీంనగర్‌లో రోజుకు వెయ్యి మంది చొప్పున వివిధ క్యాన్సర్లకు సంబంధించిన పరీక్షలను నిర్వహిస్తామని తెలిపారు. అభిమానులు, సినీ కార్మికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. ఈ మేరకు మరోసారి మీడియా ముందుకు వచ్చిన మెగా స్టార్ చిరంజీవి.. క్యాన్సర్‌కు సంబంధించిన పలు విషయాలను అభిమానులతో పంచుకున్నారు. అంతే కాకుండా.. గతంలో క్యాన్సర్ వ్యాధిని ఉద్దేశించి మాట్లాడినప్పుడు తనకే క్యాన్సర్ వచ్చినట్లు వార్తలు రాశారు. మళ్లీ అలా రాయొద్దు అంటూ స్వీట్‌గా వార్నింగ్ ఇచ్చారు చిరు.

Also Read: ఆ విషయం తెలిసి కూడా లావణ్యను మెగా కోడలిగా ఒప్పుకున్న నాగబాబు.. అసలు మ్యాటర్ ఏమిటంటే?

Tags:    

Similar News