బాగా కొవ్వెక్కి కొట్టుకుంటున్నావ్: లేడీ సింగర్‌పై దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు
చైనీస్ సింగర్ అండ్ రైటర్ జేన్ జాంగ్ వింత ప్రవర్తనతో నెటిజన్లకు షాక్ ఇచ్చింది.
దిశ, సినిమా : చైనీస్ సింగర్ అండ్ రైటర్ జేన్ జాంగ్ వింత ప్రవర్తనతో నెటిజన్లకు షాక్ ఇచ్చింది. ప్రస్తుతం చైనాలో కరోనా వైరస్ BF-7 ఒమిక్రాన్ వేరియంట్ పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఉద్దేశపూర్వకంగానే తనకు కరోనా సోకేలా చేసుకున్నానని తెలిపి దారుణంగా విమర్శలు ఎదుర్కుంటోంది. అయితే ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్న ఆమె..రాబోయే నూతన సంవత్సర వేడుకల్లో కచేరీ చేయాల్సి ఉందని, కావున ముందే వైరస్ అంటించుకుని పూర్తిగా కోలుకుంటే షెడ్యూల్‌కు ఎలాంటి ఆటంకం కలగకుండా ఉంటుందని ఈ ప్రయత్నం చేసినట్లు తెలిపింది. 'వైరస్ నుంచి కోలుకోవడానికి సమయం ఉన్నందున పాజిటివ్ ఉన్న వ్యక్తుల సమూహాన్ని కలిశా. దీంతో జ్వరం, గొంతు, బాడీ పెయిన్స్ వంటి లక్షణాలు ఏర్పడ్డాయి. ఇవన్నీ కొవిడ్ లక్షణాల మాదిరిగానే ఉన్నప్పటికీ ఒక రోజంతా పడుకోగానే మాయమయ్యాయి. అధిక మోతాదులో నీరు తాగడంతోపాటు కేవలం విటమిన్ 'సి' తీసుకున్నా' అంటూ నెట్టింట ఓ నోట్ పోస్ట్ చేసింది. అయితే ఇది వైరల్ కావడంతో 'బాధ్యతారహితమైన ప్రవర్తన. కొవ్వెక్కి కొట్టుకుంటోంది' అంటూ నెటిజన్లు దుమ్మెత్తిపోశారు. దీంతో వెంటనే ఈ వివాదాస్పద పోస్ట్‌ను తొలగించి ప్రజలకు క్షమాపణలు చెప్పింది జేన్ జాంగ్.