ఈ చైల్డ్ ఆర్టిస్ట్ గ్లామర్ మమూలుగా లేదు.. ఎవరైనా ఫిదా అవ్వాల్సిదే!
‘గంగోత్రి’ సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా పరిచయమైన కావ్య కల్యాణ్.. రీసెంట్గా వచ్చిన ‘బలగం’ మూవీతో హీరోమిన్గా మారిపోయింది.
దిశ, సినిమా: ‘గంగోత్రి’ సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా పరిచయమైన కావ్య కల్యాణ్.. రీసెంట్గా వచ్చిన ‘బలగం’ మూవీతో హీరోమిన్గా మారిపోయింది. ఈ చిత్రం మంచి హిట్ సొంతం చేసుకోవడంతో.. కావ్య నటనకు కూడా మంచి మార్కులే పడ్డాయి. దీంతో వరుస సినిమాలు చేస్తూ బిజీ అయిపోతుంది అనుకున్నారు అంతా. కానీ ఊహించిన రీతిలో ఈ అమ్మడు సినిమాలు అనౌన్స్ చెయ్యడం లేదు. అయితే.. మూవీస్ చెయ్యనప్పటికీ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో టచ్‌లోనే ఉంటుంది.
తనకు సంబంధించిన ప్రతి అంశాన్ని అభిమానులతో పంచుకోవడంతో పాటు.. అప్పుడప్పుడు గ్లామర్ షోతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా లేటెస్ట్ ఫోటోస్ ఇన్‌స్టా వేదికగా పంచుకుంది. బ్లాక్ కలర్ ట్రెండీ డ్రెస్‌లో దర్శనమిచ్చిన ఈ బ్యూటీ అందాలకు ఫిదా అవుతున్నారు కుర్రాళ్లు. అంతే కాకుండా ‘బ్లాక్ క్వీన్.. స్టన్నింగ్స్ లుక్స్, మెస్మరైజింగ్’ అంటూ కామెంట్ల పెడుతూ సందడి చేస్తున్నారు.