Charmy Kaur: రవితేజ ఆఫీస్‌లో గొడవకి దిగిన టాలీవుడ్ హీరోయిన్!.. కారణం అదేనా?

ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా రాణించిన చార్మి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

Update: 2024-07-28 05:29 GMT

దిశ, సినిమా: ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా రాణించిన చార్మి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన అందం, నటనతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ‘నీ తోడు కావాలి’ అనే మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ తర్వాత అనేక సూపర్ హిట్ మూవీల్లో నటించి ప్రేక్షకుల్లో మంచి ఫేమ్ తెచ్చుకుంది. ఈమె కేవలం తెలుగులోనే కాకుండా తమిళం, హిందీ, మలయాళం వంటి భాషా చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇలా వరుసగా సినిమాలు చేస్తునే ఈ అమ్మడు ప్రొడ్యూసర్‌గా కూడా తన కెరియర్ స్టార్ట్ చేసింది. అందులో భాగంగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘జ్యోతిలక్ష్మి’ సినిమాతో కో ప్రొడ్యూసర్‌గా తన జర్నీ స్టార్ట్ చేసింది. అక్కడితో సినిమాలకు బ్రేక్ ఇచ్చింది చార్మి. ఇదిలా ఉంటే పూరి జగన్నాథ్‌కి రవితేజ తోను, హరీష్ శంకర్‌తోని ఎంత మంచి బాండింగ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి రవితేజతో హీరోయిన్ ఛార్మీ లేటెస్ట్‌గా గొడవపడినట్టు ఫిలిం నగర్‌లో హాట్ టాపిక్ నడుస్తుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే

రవితేజ - హరీష్ శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కిన 'మిస్టర్ బచ్చన్', అలాగే పూరి జగన్నాథ్ - రామ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన 'డబుల్ ఇస్మార్ట్'. ఈ రెండు సినిమాలు కూడా ఆగస్టు 15‌వ తారీఖున గ్రాండ్‌గా విడుదల కాబోతున్నాయి. ఈ సందర్భంగా ఛార్మీ నేడు రవితేజతో, నిర్మాతతో ప్రత్యేకంగా భేటీ అయ్యి, థియేటర్స్ సర్దుబాటు పై చర్చలు జరిపింది. ఎందుకంటే డబుల్ ఇస్మార్ట్ మూవీకి పూరి జగన్నాథ్‌తో పాటుగా ఈమె కూడా నిర్మాతగా వ్యవహరించింది కాబట్టి.

ఈ నేపథ్యంలో ముందుగా మిస్టర్ బచ్చన్ చిత్రాన్ని ఒక రోజు ముందుగా విడుదల చేయాలని కోరింది ఛార్మీ. అందుకు నిర్మాత విశ్వప్రసాద్ ఒప్పుకోలేదు, ఆ తర్వాత కనీసం థియేటర్స్ సర్దుబాటు అయినా చేయాలని, తమకు కొన్ని మంచి థియేటర్స్ ఇవ్వాలని ఆమె పట్టుబట్టిందట. కానీ నిర్మాత అందుకు కూడా ఒప్పుకోలేదట. దీంతో ఆగ్రహానికి గురైన చార్మి.. సోషల్ మీడియా‌లో హీరో రవితేజని, డైరెక్టర్ హరీష్ శంకర్‌ని ట్విట్టర్, ఇంస్టాగ్రామ్, ఫేస్ బుక్ ఇలా అన్నీ అకౌంట్స్‌లో కూడా అన్ ఫాలో చేసేసింది. దీంతో ఈ న్యూస్ నెట్టింట హాట్ టాపిక్ అయ్యింది. మరి వీళ్లిద్దరి మధ్య గొడవ సర్దుమణుగుతుందా లేదా పెద్దది అవుతుందా అనేది చూడాలి.

Tags:    

Similar News