Ram Charan: 'కభీ ఈద్ కభీ దివాలీ'.. సల్మాన్‌తో రామ్ చరణ్ స్పెషల్ సాంగ్

Ram Charan Will Act In Cameo Role In Salman Khan's Kabhi Eid Kabhi Diwali| బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్, పూజా హెగ్డే జంటగా తెరకెక్కుతున్న 'కభీ ఈద్ కభీ దివాళి' చిత్రం కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

Update: 2022-06-21 08:34 GMT

దిశ, సినిమా : Ram Charan Will Act In Cameo Role In Salman Khan's Kabhi Eid Kabhi Diwali| బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్, పూజా హెగ్డే జంటగా తెరకెక్కుతున్న 'కభీ ఈద్ కభీ దివాళి' చిత్రం కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఫర్హాద్ సంజీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లోనే జరుగుతోంది. ఇదిలా ఉంటే.. ఈ మూవీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఓ స్పెషల్ సాంగ్ చేయబోతున్నాడనే టాక్ వినిపిస్తోంది. ఈ వార్త అభిమానులకు కిక్ ఇస్తుండగా.. చెర్రీ, సల్మాన్ కలిసి మాస్ సాంగ్‌లో కనిపిస్తే ఆ మజానే వేరంటూ సంబరపడిపోతున్నారు. ఇక వెంకటేష్‌తో పాటు జాస్సీ గిల్, షెహనాజ్ గిల్, పాలక్ తివారీ, రాఘవ్ జుయల్, సిద్ధార్థ్ నిగమ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న చిత్రాన్ని క్రిస్మస్ స్పెషల్‌గా విడుదల చేయబోతున్నారు మేకర్స్.

Tags:    

Similar News