పక్కనే తల్లి శవం.. అయిన కూడా షూటింగ్ పూర్తి చేసిన చంద్రమోహన్
ఈ రోజు (నవంబర్ 11) ఉదయం 9.45 నిమిషాలకు తెలుగు దిగ్గజ నటుడు చంద్రమోహన్ కన్నుమూశాడు.
దిశ, సినిమా: ఈ రోజు (నవంబర్ 11) ఉదయం 9.45 నిమిషాలకు తెలుగు దిగ్గజ నటుడు చంద్రమోహన్ కన్నుమూశాడు. దీంతో సినీ పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది. అనేక చిత్రాల్లో ప్రధాన, సహాయక పాత్రలు పోషించిన ఆయన.. 1966లో ‘రంగుల రాట్నం’ సినిమాతో రంగప్రవేశం చేసి తన కెరీర్‌లో ఇప్పటి వరకు 900కుపైగా చిత్రాల్లో నటించాడు. ‘పదహారేళ్ల వయసు’, ‘సిరి సిరి మువ్వ’, ‘సీతామాలక్ష్మి’, ‘రామ్ రాబర్ట్ రహీమ్’, ‘రాధా కళ్యాణం’, ‘రెండు రెళ్ళు ఆరు’, ‘చందమామ రావే’ వంటి సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్నాడు. అయితే చంద్రమోహన్ ఒక సినిమా ఒప్పుకుంటే అందులోని తన క్యారెక్టర్ కోసం ఫుల్ డెడికేషన్ పెట్టేవాడు.
ఎంతలా అంటే చంద్రమోహన్ ‘మనసంతా నువ్వే’ సినిమాలో హీరో ఉదయ్ కిరణ్ ఫాదర్ రోల్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీ షూటింగ్ సమయంలో చంద్రమోహన్ తల్లి మరణించిందట. ఒక సీన్ షూట్ చేస్తున్న టైంలో ఈ వార్త అతడి చెవిన పడింది. దాంతో అప్పటికే అతడిలో దుఃఖం మొదలైనప్పటికీ.. షూటింగ్ మధ్యలో వదిలేసి వెంటనే తల్లిని చూసేందుకు వెళ్లడం ఇష్టం లేక అలానే నటించాడు. అంతేకాకుండా ముఖంలో బాధ కనిపించకుండా చాలా నేచురల్‌గా ఆ సీన్‌ను పండించాడు. ఆయన డెడికేషన్ ఉన్న గొప్ప నటుడు అనడానికి ఇంతకంటే ప్రూఫ్ ఏం కావాలి చెప్పండి.