KCR , Puri Jagannadh : కేసీఆర్‌ను అవమానించిన పూరీ జగన్నాధ్... కేసు నమోదు

పూరీ జగన్నాధ్ - రామ్ పోతినేని కాంబినేషన్ లో వచ్చిన ' ఇస్మార్ట్ శంకర్ ' బ్లాక్ బస్టర్ హిట్ అయింది. దీనికి సీక్వెల్ గా ' డబుల్ ఇస్మార్ట్ ' లోడ్ అవుతుంది. ఈ క్రమంలోనే ప్రమోషన్స్ స్టార్ట్

Update: 2024-07-18 12:14 GMT
KCR , Puri Jagannadh : కేసీఆర్‌ను అవమానించిన పూరీ జగన్నాధ్... కేసు నమోదు
  • whatsapp icon

దిశ, సినిమా: పూరీ జగన్నాధ్ - రామ్ పోతినేని కాంబినేషన్ లో వచ్చిన ' ఇస్మార్ట్ శంకర్ ' బ్లాక్ బస్టర్ హిట్ అయింది. దీనికి సీక్వెల్ గా ' డబుల్ ఇస్మార్ట్ ' లోడ్ అవుతుంది. ఈ క్రమంలోనే ప్రమోషన్స్ స్టార్ట్ కాగా ఈ మధ్య సెకండ్ సింగిల్ ' మార్ ముంత చోడ్ చింత ' రిలీజ్ చేశారు. అయితే ఇందులో ' ఏం జేద్దామంటవ్ మరి ' అనే కేసీఆర్ పాపులర్ డైలాగ్ఈ సాంగ్ లో వినియోగించారు. దీంతో BRS నాయకులు, కార్యకర్తలు ఫైర్ అవుతున్నారు. డైరెక్టర్ మీద ఫిర్యాదు చేస్తూ పోలీసులను ఆశ్రయించారు.

' మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ డైలాగ్ ను పూరీ జగన్నాధ్ హుక్ లైన్ గా వాడారు. ఇది చాలా అభ్యంతరకరమైన విషయం. KCR, తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉంది. మా ప్రాంత యాస, భాషలను కించపరిచినా, మా BRS అధినాయుడిని కించపర్చినా ఊరుకునే ప్రసక్తే లేదు. ఆ డైలాగ్ ను సాంగ్ నుంచి వెంటనే రిమూవ్ చేయాలని కోరుతున్నాం ' అంటూ బీఆర్ఎస్ కు చెందిన ఎం. రజిత రెడ్డి, జి. సతీష్ కుమార్ ఎల్బీ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.

 

Tags:    

Similar News