‘భారతీయుడు 2’లో మిస్ యూనివర్స్ అందాలతో అదరహో అంటున్న ‘క్యాలెండర్’ సాంగ్..!
స్టార్ హీరో కమల్ హాసన్, డైరెక్టర్ శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న మూవీ ‘భారతీయుడు 2’.
దిశ, సినిమా: స్టార్ హీరో కమల్ హాసన్, డైరెక్టర్ శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న మూవీ ‘భారతీయుడు 2’. ఈ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌తో పాటు అగ్ర నిర్మాణ సంస్థ రెడ్ జాయింట్ బ్యానర్‌పై సుభాస్కరన్ భారీ బడ్జేట్‌తో నిర్మిస్తున్నాడు. ఇక ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో జులై 12న ఈ సినిమా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ సినిమాకి ఇంకా రెండు వారాల సమయం కూడా లేకపోవడంతో ఇండియన్ 2 మూవీ టీమ్ ప్రమోషన్స్‌లో జోరు పెంచేశారు.
ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా నుంచి సాంగ్స్ కూడా ఒక్కొక్కటిగా వస్తున్నాయి. తాజాగా క్యాలెండర్ సాంగ్ పేరిట మరో లిరికల్ సాంగ్‌ని మూవీ టీమ్ విడుదల చేసింది. ఆ సాంగ్ చూసిన తర్వాత డైరెక్టర్ శంకర్ తన మార్క్ చూపించాడని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.సాధారణంగా డైరెక్టర్ శంకర్ సినిమా అంటే సాంగ్స్ మీద భారీ అంచనాలు ఉంటాయి. ఇప్పటికే రిలీజ్ చేసిన సాంగ్స్ లో ఆ టచ్ కనపడలేదు. కానీ, తాజాగా వచ్చిన సాంగ్ మాత్రం వాటిని కొట్టిపడేసింది. అయితే శంకర్ తన సినిమా సాంగ్స్‌లో కచ్చితంగా ఒరిజినల్ లొకేషన్స్‌లో తీసేందుకే ఎక్కువ ఆసక్తి చూపిస్తారు.
అలాగే ఈ సాంగ్‌ని కూడా ఒక లైవ్ లొకేషన్ లోనే శంకర్ ప్లాన్ చేశారు. ఈ సాంగ్ చూడటానికి మాత్రం బాగా రిచ్‌గా.. డైరెక్టర్ వింటేజ్ టచ్ కనిపిస్తోంది. ఈ సాంగ్ కోసం ఏకంగా 2017 మిస్ యూనివర్స్ అయిన డెమి లేయ్ టెబోని తీసుకున్నారు. ఆమె హాట్ హాట్ అందాలు ఈ పాటలో అదిరిపోయాయి. అయినా మోడల్స్‌ని వాడటంలో శంకర్ స్టైలే వేరు అనే విషయం అందరికీ తెలిసినదే. ఇక ఈ సినిమాకి సంగీతాన్ని అనిరుధ్ రవిచందర్ అందించారు. ప్రస్తుతం యూట్యూబ్‌లో ఈ క్యాలెండర్ సాంగ్ తెగ వైరల్ అవుతోంది.