'బుట్ట బొమ్మ' తెలుగు ప్రేక్షకులకు కొత్త అనుభూతినిస్తుంది: అర్జున్ దాస్

అనిక సురేంద్రన్, సూర్య వశిష్ఠ, అర్జున్ దాస్ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం 'బుట్ట బొమ్మ'.

Update: 2023-01-18 11:59 GMT

దిశ, సినిమా : అనిక సురేంద్రన్, సూర్య వశిష్ఠ, అర్జున్ దాస్ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం 'బుట్ట బొమ్మ'. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ద్వారా శౌరి చంద్రశేఖర్ రమేష్ దర్శకుడిగా పరచయమవుతున్నాడు. కాగా జనవరి 26న థియేటర్లలో విడుదలకానున్న మూవీ గురించి అర్జున్ దాస్ పలు విషయాలు మీడియాతో షేర్ చేసుకున్నాడు. 'నేను ఎన్నో తెలుగు సినిమాలు చూశాను. కానీ, తెలుగులో నటించే అవకాశం వస్తుందని ఊహించలేదు.

సితార వంటి ప్రముఖ నిర్మాణ సంస్థలో పనిచేసే అవకాశం రావడం ఆనందంగా ఉంది. ఈ చిత్రం ప్రేక్షకులకు కొత్త అనుభూతినిస్తుంది. అందరిని అలరిస్తుంది. 'బుట్టబొమ్మ' కోసం మొదటిసారి తెలుగులో డబ్బింగ్ చెబుతున్నా. సినిమా ఒప్పుకునే ముందే నిర్మాత వంశీగారు సొంతంగా డబ్బింగ్ చెప్పాలని షరతు పెట్టారు. ఏ విషయంలో నిర్మాతలు రాజీపడకుండా కావాల్సినవన్నీ సమకూర్చారు. దర్శకుడు రమేష్ మీద నమ్మకంతో పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు. సినిమా చూసిన ప్రతీ ఒక్కరూ హ్యాపీగా ఫీల్ అవుతారు' అంటూ చెప్పుకొచ్చాడు.

READ MORE

'నాటు నాటు' పాటకు స్టెప్పులేసిన ఉపాసన తల్లి.. వీడియో వైరల్ 

Tags:    

Similar News