ఒకే కథతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన బన్నీ-నాని!

అల్లు అర్జున్, నాని ఒకే కథతో వచ్చి ప్రేక్షకులను అలరించారు.

Update: 2023-09-13 14:44 GMT

దిశ, సినిమా: అల్లు అర్జున్, నాని ఒకే కథతో వచ్చి ప్రేక్షకులను అలరించారు. అవును ఆ సినిమాలు మరేవో కావు నాని నటించిన ‘దసరా’, సుకుమార్ దర్శకత్వంలో బన్నీ నటించిన ‘ఆర్య 2’. అయితే నాని మూవీ ఫుల్ యాక్షన్ స్టోరీ అయినప్పటికీ ఈ రెండు సినిమాల కాన్సెప్ట్ మాత్రం ఒకటే. ఈ రెండు చిత్రాల్లో ఇద్దరు హీరోలుండగా చిన్నప్పటినుంచి మంచి స్నేహితులు. కాగా ఈ కథలు మొత్తం హీరోయిన్ల చుట్టే తిరుగుతాయి. స్నేహితుడి కోసం ప్రేమించిన అమ్మాయిని త్యాగం చేయాలని హీరో అనుకుంటాడు. కానీ చివరికి మెయిన్ హీరోకే హీరోయిన్ దక్కుతుంది. ఇలా రెండింటి కథ వేరైనా కాన్సెప్ట్ మాత్రం ఒకటే. ఏదేమైనప్పటికీ రెండు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి.

Tags:    

Similar News