ఆ ఇంజెక్షన్ నా జీవితాన్ని నాశనం చేసింది: Britney Spears
హాలీవుడ్ స్టార్ సింగర్ బ్రిట్నీ స్పియర్స్ గతంలో తాను ఎదుర్కొన్న బాడీ షేమింగ్ కామెంట్స్‌పై ఓపెన్ అయింది.
దిశ, సినిమా: హాలీవుడ్ స్టార్ సింగర్ బ్రిట్నీ స్పియర్స్ గతంలో తాను ఎదుర్కొన్న బాడీ షేమింగ్ కామెంట్స్‌పై ఓపెన్ అయింది. అంతేకాదు గ్లామర్‌పై వచ్చిన బ్యాడ్ కామెంట్స్‌ను కూడా అభిమానులతో షేర్ చేసుకుంది. నిజానికి తాను అందరిలా గ్లామర్ బ్యూటీని కాదని తెలిసినా ఎన్నడూ ప్లాస్టిక్ సర్జరీల గురించి ఆలోచించలేదని చెప్పింది. అయితే ఇతరుల గురించి తానెప్పుడూ కామెంట్స్ చేయకపోయినా తనను మాత్రం ఎగతాళి చేశారని తెలిపింది. ‘ఒక కళాకారిణిగా కాస్మెటిక్ సర్జరీకి నేను వ్యతిరేకం కాదు. నేను బొటాక్స్ ఇంజెక్షన్ తీసుకున్నది నిజమే. కానీ దానివల్ల తీవ్రమైన దుష్ప్రభావాలున్నాయి. దీంతో నేను సంతోషంగా లేను. ఎందుకంటే దానివల్ల నా నుదిటి మరింత ఉబ్బడంతోపాటు నా కనురెప్పలు సహజత్వాన్ని కోల్పోయాయి. అందుకే నా మొఖంపై ఎవరో కొట్టినట్లు కనిపిస్తుంది. దీంతో చాలా సమస్యలు ఎదుర్కొన్నా. నా ఫ్రెండ్స్, కజిన్స్ కూడా నన్ను చూసి నవ్వారు. ఫక్ బొటాక్స్.. నెవర్ అగైన్’ అంటూ బ్రిట్నీ చెప్పుకొచ్చింది.
Read More: పెళ్లికి ముందే ప్రెగ్నెంట్.. అవమానం తట్టుకోలేక హీరోయిన్ పేరెంట్స్ ఏం చేశారంటే