వామ్మో ఇదెక్కడి రొమాన్స్ రా బాబు.. లిప్ లాక్స్‌లో రికార్డ్ బద్దలు

చాలా కాలం తర్వాత టాలీవుడ్ హీరో నవదీప్ హీరోగా మళ్లీ అడుగుపెట్టబోతున్నాడు.

Update: 2024-06-05 03:49 GMT

దిశ, సినిమా: చాలా కాలం తర్వాత టాలీవుడ్ హీరో నవదీప్ హీరోగా మళ్లీ అడుగుపెట్టబోతున్నాడు. 2004లో విడుదలైన జై సినిమాతో హీరోగా పరిచయమై.. ఆ తర్వాత వరుస సినిమాల్లో నటిస్తూ ప్రజల్లో మంచి గుర్తింపు పొందాడు. గౌతమ్ ఎస్ ఎస్ సీ సినిమాతో విజయం సాధించించాడు. ఆ తర్వాత ఒకదాని తర్వాగా సినిమాలు చేసినా పెద్దగా సక్సెస్ కాలేకత ఒకటిపోయాడు. 2007లో చందమామ సినిమాతో మరో హిట్ అందుకున్నాడు. ఆర్య 2లో సెకండ్ హీరోగా నటించి మెప్పించిన ఆయన.. ఇక అప్పటి నుంచి సెకండ్ లీడ్ హీరోగా మారి సినిమాల్లో నటించడం మొదలుపెట్టారు. తాజాగా నవదీప్ హీరోగా లవ్ మౌళి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

ఈ మూవీలో నవదీప్ పూర్తిగా డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నాడు. అవనీంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రం పూర్తి భిన్నమైన కాన్సెప్ట్‌తో రూపొందింది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్, పాటలు సినిమా మీద అంచనాలను భారీగా పెంచేసాయి. అలాగే ఈ మూవీలో నవదీప్ పెయింటర్ గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో చాలా రొమాంటిక్ సీన్స్ ఉంటాయని తెలుస్తోంది.

ఇప్పుడు ఈ మూవీకి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో 42 లిప్ కిస్సింగ్ సీన్స్ ఉన్నాయని అంటున్నారు. గతంలో అర్జున్ రెడ్డి సినిమాలో 25 లిప్ కిస్‌లు ఉన్నాయి. ఈ సినిమాలో 42 లిప్ కిస్సింగ్ సీన్లు ఉన్నాయి. జూన్ 7న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. మరి ఈ మూవీ హిట్ అవుతుందో? లేదో చూడాలి.


Similar News