Jr NTR కంటే బ్రాహ్మణికే పాపులారిటీ ఎక్కువ.. ఆర్జీవి ఇంట్రెస్టింగ్ ట్వీట్
వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ పలు పోస్టులు చేస్తుంటారు.
దిశ, వెబ్‌డెస్క్: వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ పలు పోస్టులు చేస్తుంటారు. అయితే ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన కానుంచి ఆర్టీవి తన ట్వీట్లతో రెచ్చిపోతున్నారు. అయితే ఆ క్రమంలో తన మామ అరెస్ట్ అయిన నేపథ్యంలో ఆయన కోడలు బ్రాహ్మణి తన అత్తగారు నారా భువనేశ్వరితో కలిసి రాజమండ్రిలో కొవ్వొత్తులతో నిరసన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వర్మ బ్రాహ్మణి గురించి ట్వీట్ చేశారు.
‘‘బ్రాహ్మణి గారు.. మీకు మీ భర్త కానీ లేక ఇంకెవరైనా కానీ రాజకీయ అంశాల గురించి తప్పుడు సమాచారం ఇస్తున్నట్లున్నారు. కానీ మీరు దయచేసి టైం కాని టైంలో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి ఈ బెస్ట్ అవకాశాన్ని వృథా కానివ్వకండి. దీని గురించి మరింత లోతుగా త్వరలో వివరిస్తాను. కానీ నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే.. సీనియర్ NTR తర్వాత ప్రజల్లో ఇంతటి పాపులారిటీ జూనియర్ NTR కంటే మీకే ఉంది’’ అంటూ రాసుకొచ్చాడు.
Respected @brahmaninara gaaru I think you are being grossly misinformed by ur husband or whoever else , but I implore upon u , that u don’t waste the opportunity of making a grand political entry by making a wrong entry in a hurry as in the present context ..will tell more on…
— Ram Gopal Varma (@RGVzoomin) September 16, 2023