'Brahmastra' ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ రద్దు.. మేకర్స్‌కు కోట్లలో నష్టం..

దిశ, సినిమా: రణ్‌బీర్ కపూర్-అలియా భట్ హీరోహీరోయిన్లుగా నటించిన పాన్ ఇండియా ఫిల్మ్ 'బ్రహ్మాస్త్ర' సెప్టెంబర్ 9న విడుదల కానుంది.

Update: 2022-09-03 13:45 GMT

దిశ, సినిమా: రణ్‌బీర్ కపూర్-అలియా భట్ హీరోహీరోయిన్లుగా నటించిన పాన్ ఇండియా ఫిల్మ్ 'బ్రహ్మాస్త్ర' సెప్టెంబర్ 9న విడుదల కానుంది. అమితాబ్‌ బచ్చన్‌, నాగార్జున ప్రధాన పాత్రలో కనిపించనున్న సినిమా ప్రమోషన్స్ ఇప్పటికే మొదలుపెట్టినా.. శుక్రవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్రీరిలీజ్ ఈవెంట్ రద్దు కావడం ఎదురుదెబ్బే అంటున్నారు విశ్లేషకులు. పైగా దీనికి రాజకీయరంగు పులుముకోగా.. కార్యక్రమం చివరి నిమిషంలో రద్దుకావడంతో దాదాపు రూ. 2.25కోట్ల నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. అంతేకాక అప్పటికప్పుడు పార్క్ హయత్‌లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన మూవీ యూనిట్ ఇందుకోసం రూ. 10లక్షలు ఖర్చుచేసిందని సమాచారం.

Also Read : నిఖిల్‌ను ఈ క్లబ్‌లో ఊహించి ఉండరు.. 

Tags:    

Similar News