'BREAKOUT' తో వస్తున్న బ్రహ్మానందం తనయుడు.. ఆసక్తిగా ఫస్ట్ లుక్

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ కమెడియన్ బ్రహ్మానందం తనయుడు రాజా గౌతమ్ ' 'పల్లకిలో పెళ్లికూతురు' సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. మొదటి చిత్రంతోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు..Latest Telugu News

Update: 2022-08-27 06:09 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ కమెడియన్ బ్రహ్మానందం తనయుడు రాజా గౌతమ్ ' 'పల్లకిలో పెళ్లికూతురు' సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. మొదటి చిత్రంతోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. ఆ తర్వాత 2018లో 'మను'మూవీతో అభిమానులను అలరించాడు. తాజాగా, 'బ్రేక్ అవుట్' సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. సుబ్బు చెరుకూరి దర్శకత్వం వహించాడు. ఈ మూవీని ఏఎంఎఫ్ బ్యానర్ పై అనీల్ మెడుగా నిర్మిస్తున్నారు.

జాన్స్ రుపెర్ట్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి అర్జున్ బసవ ఎడిటర్ గా చేస్తున్నారు.ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. పోస్టర్‌లో తీవ్ర వేదనలో కనిపించిన రాజా గౌతమ్ కిటికీలోంచి అరుస్తున్నాడు. అతనిపై గాయాలు కూడా ఉన్నాయి. 

ఇవి కూడా చదవండి : 'రంగ రంగ వైభవంగా' టైటిల్ సాంగ్.. పండగ వాతావరణంతో..

Tags:    

Similar News